Moviesజ్యోతికను చూడకుండా ఉండిఉంటే ..హీరో సూర్య ఆ అమ్మాయినే పెళ్లి చేసుకునేవాడా..?

జ్యోతికను చూడకుండా ఉండిఉంటే ..హీరో సూర్య ఆ అమ్మాయినే పెళ్లి చేసుకునేవాడా..?

కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. నటనలో అందరికన్నా టాప్ పోజీషన్ లో ఉండే సూర్య.. దాన ధర్మాల విషయంలో చాలాముందు ఉంటాడు . ఎవరైనా సరే సహాయం కోరి ఇంటికి వస్తే లేదు కాదు అనకుండా హెల్ప్ చేసే సూర్య .. బయట ప్రపంచానికి తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎంతో మంది అనాధ పిల్లలకు సహాయపడుతున్నారు. ఈ విషయాలు జనాలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు . అది ఆయన సింపుల్ సిటీ అని చెప్పాలి .

మరి ముఖ్యంగా సూర్యకి సంబంధించిన ప్రతి విషయం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అయితే రీసెంట్గా కోలీవుడ్ మీడియాలో హీరో సూర్యకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ యమ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇంట్లో వీళ్ల పెళ్లి కి ఒప్పుకోరు అన్న భయంతో ముందుగానే గుడిలో పెళ్లి చేసుకున్నారు .

ఆ తర్వాత ఆ మేటర్ వాళ్ళ ఇంట్లో వాళ్లకు తెలిసి అరిచి.. తిట్టి ..కొట్టి ..ఫైనల్లీ గ్రాండ్గా అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిపించారు . అయితే హీరో సూర్య మదర్ కి ఈ పెళ్లి ఇష్టం లేదట . మొదటి నుంచి జ్యోతిక అంటే సూర్య మదర్ కి అసలు ఇష్టం లేదని.. ఆమె తన బంధువుల్లో సూర్యకి మరదలు వరసయ్యే అమ్మాయిని చేయాలనుకునిందని .. కానీ సూర్య అప్పటికి పెళ్లి చేసుకోవడంతో చేసేది ఏమీ లేక సైలెంట్ గా వాళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేసిందన్న వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ నిజంగా సూర్యకంట జ్యోతిక కనబడకపోయి ఉంటే కచ్చితంగా ఆయన తన మరదలని చేసుకొని ఉండేవాడు అని ఆయన అభిమానులు ఆయన బంధువులు చెప్పుకొస్తున్నారు..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news