Moviesభారీ గా రెమ్యూనరేషన్ పెంచిన యాంకర్ సుమ..? ఒక్కో ప్రోగ్రామ్ కు...

భారీ గా రెమ్యూనరేషన్ పెంచిన యాంకర్ సుమ..? ఒక్కో ప్రోగ్రామ్ కు ఎంత తీసుకుంటుందంటే..?

బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా .. యాంకర్ సుమ పేరు చెప్తే వచ్చే కిక్కే వేరు . కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీ ని బుల్లితెర అని సింగిల్ హ్యాండ్ తో వఏలేస్తున్న సుమ గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి . మరీ ముఖ్యంగా ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయిన.. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా.. ఆడియో లాంచ్ ఈవెంట్ అయిన.. సుమ ఉండాల్సిందే.

బుల్లితెరపై తనదైనా స్టైల్ లో దూసుకుపోతున్న యాంకర్ సుమ ఇండస్ట్రీలో కూడా నెంబర్ వన్ యాంకర్ గా చెరగని ముద్రను వేయించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో యాంకర్ సుమ సైతం హద్దులు మీరుతుంది . పవర్ ఫుల్ పంచ్ లు.. బోల్డ్ కంటెంట్ ప్రదర్శిస్తుంది. మరి ముఖ్యంగా ఆమె హోస్ట్ చేసే సుమ అడ్డ షోలో సుమ వేసే భారీ వల్గర్ పంచ్స్ ఈ మధ్యకాలంలో జనాలకు కొంచెం ఎబ్బెటు గా అనిపిస్తున్నాయి .

అంతేకాదు యాంకర్ సుమ ఇలా చేసింది రెమ్యూనరేషన్ పెంచేందుకు అనే న్యూస్ వైరల్ అవుతుంది. మొన్నటి వరకు ఒక్కో ఈవెంట్ కి లక్ష – లక్ష యాభై ఐదు వేలు తీసుకునే సుమ ఇప్పుడు ఏకంగా ఆ సంఖ్యను మూడు చేసేసిందట . సుమ మూవీ ఫంక్షన్లకు హోస్ట్ చేయాల్సివస్తే ఒక్కొక్క ఫంక్షన్ కి నాలుగు నుంచి ఆరు లక్షల వరకు తీసుకుంటున్నారట . టీవీ ప్రోగ్రాం అయితే మూడు నుంచి ఐదు లక్షలు చార్జ్ చేస్తుందట . ఇది చాలా చాలా ఎక్కువ . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ లో డిమాండ్ చేయదు . అయితే సుమకి ఉన్న పబ్లిసిటీ పాపులారిటి పరంగా ఇలా చేసింది అంటూ టాక్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news