Moviesఅదితి రావు తో ముద్దులాట.. పబ్లిక్ గా అడిన రిపోర్టర్ ....

అదితి రావు తో ముద్దులాట.. పబ్లిక్ గా అడిన రిపోర్టర్ . హీరో సిద్థార్ధ్ స్వీట్ వార్నింగ్ (వీడియో )..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సిద్ధార్ధ్ కి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”, “బాయ్స్”, “బొమ్మరిల్లు”. ఇలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్థ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా “టక్కర్”. సిద్ధార్ధ్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా “టక్కర్”. కార్తీక్ జి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 9న గ్రాండ్గా విడుదల కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హిట్ లేక అల్లాడుతున్న సిద్ధార్ధ్ ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు.

దీంతో సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు . మరి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాని హిట్ స్థానంలో నిలబెట్టడానికి సిద్ధార్ధ్ నానా తంటాలు పడుతున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు . అయితే ఈ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ మాట్లాడుతూ సిద్ధార్థ పర్సనల్ క్వశ్చన్ అడిగారు. హీరో సిద్ధార్ధ్ నీ రిపోర్టర్ ప్రశ్నిస్తూ ..”రీల్ లవ్ లో సక్సెస్ఫుల్ హీరో గా ఉన్న మీరు రియల్ లైఫ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు.. దానికి కారణం ..? దీని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా..?” అన్న రిపోర్టర్ ప్రశ్నకు కూసింత ఘాటుగానే సమాధానమిచ్చాడు సిద్ధార్ధ్.

సిద్ధార్థ స్పందిస్తూ..” మళ్ళీ ఇలాంటి కామెంట్రీ అద్దం చూసి గాని నిద్రపోతున్నప్పుడు గానీ నా మైండ్ లో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా నేను అలాంటివి ఆలోచించలేదు . ఆఫ్ కోర్స్ మీకు నా రియల్ లైఫ్ లో నేను ఎలా ప్రేమిస్తానన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు . కాబట్టి మీరు నేను పర్సనల్ గా బయట కూర్చుని మాట్లాడుకుందాం. దీనికి ఈ ప్రెస్ మీట్ కి సంబంధం లేదు . టక్కర్ సినిమాకు అసలే సంబంధం లేదు “అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చేసారు సిద్ధార్ధ్. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది .

కాగా సిద్ధార్ధ్ బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరితో డేటింగ్ లో ఉన్నాడు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టే ఈ జంట రాసుకుని పూసుకొని తిరుగుతూ ఉండడం కలిసి మహాసముద్రం సినిమాలో టూ హాట్ గా నటించడం జనాలకు ఆ వార్తలు నిజమే అనిపిస్తుంది . మహాసముద్రం సినిమాలో వీళ్ళు చేసిన ఘాటు లిప్ లాక్ రొమాన్స్ కు సినీ ఇండస్ట్రీని షేక్ అయిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news