Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్నా.. ఆ హిట్ సినిమా...

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్నా.. ఆ హిట్ సినిమా సీక్వెల్ లో ఛాన్స్.. దశ తిరిగిపోయిందిపో..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న యంగ్ బ్యూటీ రష్మిక మందన్నా హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా “చలో” సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా పుష్ప లో నటించిన తర్వాత పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకొని భారీ భారీ ఆఫర్స్ తన ఖాతాలో వేసుకుంటుంది .

ఇప్పటికే పుష్ప2 సినిమాతో మరో హిట్ ని అందుకోవడానికి రెడీగా ఉన్నా రష్మిక మందన్నా..నితిన్ తో ఓ సినిమాకి కమిట్ అయింది . అంతేకాదు గీతా గోవిందం 2 సినిమాలో కూడా రష్మిక మందన హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ లోకూడా వరుస ఆఫర్లు అందుకుంటుంది . ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ – రణబీర్ కపూర్ కాంబోలో తెరకెక్కుతున్న అనిమల్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిన రష్మిక ..ఇది కాకుండా మూడు సినిమాలను చేత్తో పట్టుకొని ఉంది .

తాజాగా మరో బాలీవుడ్ సినిమాకి సైన్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమాను హిందీలో “రౌడీ రాథోడ్” అనే పేరుతో రీమేక్ చేసిన విషయం మనందరికీ బాగా తెలుసు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పెట్టేసింది . కాగా ఈ సినిమాకు బాలీవుడ్ లో సీక్వెల్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారట .

అయితే సీక్వెల్ లో హీరోగా షాహిద్ కపూర్ నటించనుండగా ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నారట. అంతేకాదు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారట . దీంతో రష్మిక మందన హీరోయిన్గా ఫిక్స్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి . దీంతో రష్మిక మందన జాక్ పాట్ ఆఫర్ అందుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news