Moviesప‌వ‌న్ మ‌ర‌ద‌లు ప్రణీత ఇలాంటి త‌ల‌తిక్క ప‌నులు కూడా చేస్తుందా...!

ప‌వ‌న్ మ‌ర‌ద‌లు ప్రణీత ఇలాంటి త‌ల‌తిక్క ప‌నులు కూడా చేస్తుందా…!

చాలా మంది సినీ స్టార్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తుంటారు. ఈ క్రమంలో తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంటారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇస్తుంటారు. కొందరు నెటిజన్లు ఇబ్బంది పెట్టే ప్రశ్నలడిగినా చాలా సహనంతో వ్యవహరిస్తుంటారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అత్తారింటికి దారేదిలో మ‌ర‌ద‌లుగా చేసిన హీరోయిన్ ప్రణీత కూడా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానం అందించారు.

ఈ కన్నడ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏం పిల్లడో.. ఏం పిల్లడో అనే సినిమా ద్వారా టాలీవుడ్‌కి ఆమె పరిచయం అయింది. అయితే పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత బ్రహ్మోత్సవం, రభస, బావ వంటి వరుస సినిమాలు చేసింది. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లలో నటించింది. సినిమాలు కాకుండా ఆమె వ్యక్తిగత జీవితమే ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

కరోనా సమయంలో ప్రణీత ఫౌండేషన్ ద్వారా ఆమె ఎందరికో సేవలు అందించింది. నేటికీ తన ఫౌండేషన్ ద్వారా ఆపన్నులకు సాయం అందిస్తుంటుంది. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే నితిన్ రాజ్ అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లాడింది. తర్వాత ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఓ బిడ్డకు తల్లి అయినా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఆమె తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని ఆమెను గూగుల్‌లో ఇటీవల ఏం సెర్చ్ చేశారని ప్రశ్నించాడు. తన ఏడాది పాప ఏమీ తినడం లేదని, ఏం పెడితే బాగుంటుందో గూగుల్ సెర్చ్ చేసినట్లు ఆమె బదులిచ్చింది. గూగుల్‌ను ఇలా కూడా వాడతారా.. మొత్తానికి నువ్వు పెద్ద త‌ల‌తిక్క దానివే అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news