Moviesతమన్ పై దారుణమైన ట్రోల్స్.. చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన భార్య..!!

తమన్ పై దారుణమైన ట్రోల్స్.. చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన భార్య..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హవా ఎంతలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన మ్యూజిక్ ఇచ్చిన అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతూ ఉండడం.. ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరుతూ ఉండడంతో.. స్టార్ హీరోలు కూడా అడిగి మరీ ఏరి కోరి తమన్ నే తమ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తుంది తమన్ నే కావడం గమనార్హం.

కాగా ఇదే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్లింగ్ జరుగుతూ ఉన్నాయి . ఒక సినిమాకి కొట్టిన మ్యూజిక్ ని మరో సినిమాకి కాపీ కొడుతున్నాడు అంటూ కాపీ రాజా అని ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఇదే ట్రోలింగ్ పై తమన్ భార్య స్పందించింది. కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..తమన్ భార్య శ్రీ వర్ధిని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ..” తమన్ ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, హేట్ చేసే వాళ్ళు ఉన్నారు . అయితే తమన్ ఇంటర్వ్యూలు చూస్తాను . వాటి కింద వచ్చే కామెంట్స్ మాత్రం చదవను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ . నా భర్త గురించి అంత చీప్ గా ట్రోల్ చేస్తున్నారు అని తెలిస్తే నా మనసు బాధగా అనిపిస్తుంది . అందుకే ఎప్పుడూ నేను అలాంటి కామెంట్స్ చదవను.. అంతే కాదు ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నా భర్త ఏంటో నాకు తెలుసు. మా మధ్య ఇలాంటి సంభాషణలు కూడా ఏమి రావు. అసలు ఇంట్లో మేము వీటి గురించే మాట్లాడుకోము.. మా పని మేము చూసుకుంటాం “అంటూ ఘాటుగా జవాబు ఇచ్చింది .

ఈ క్రమంలోనే ట్రోలర్స్ కి తమన్ భార్య ఘాటుగా ఇచ్చి పడేసిందని.. సైలెంట్ గానే చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చింది అంటూ తమన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే తమన్ పై ఇంత ట్రోలింగ్ జరుగుతున్న స్టార్ డైరెక్టర్లు అందరూ నమ్మి హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆయన ను సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news