Moviesబాలయ్య కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం హైయెస్ట్ రెమ్యున‌రేష‌న్ .. ఆ రికార్డులు...

బాలయ్య కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం హైయెస్ట్ రెమ్యున‌రేష‌న్ .. ఆ రికార్డులు బద్ధలు కొట్టిన బాబి..!!

గ్లోబల్ లైన్ గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య వరుస సినిమాలకు కమిట్ అయ్యి అభిమానులకు క్రేజీ క్రేజీ అప్డేట్స్ ఇస్తున్నారు . రీసెంట్ గానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాకి సంబంధించిన టైటిల్ ని ఐలీజ్ చేశారు మేకర్స్. “భగవంత్ కేసరి” అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టి సినిమాకి స్పెషల్ బజ్ ని క్రియేట్ చేశారు . అంతేకాదు బాలయ్య పుట్టినరోజు నాడు రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.

మరి ముఖ్యంగా బాలయ్య లోని మాస్ యాంగిల్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో ..అదే విధంగా చూపించడం హైలైట్ గా మారింది . అంతేకాదు బాలయ్య నోటి నుండి హిందీ డైలాగ్లు విన్న అభిమానులు ఊగిపోతున్నారు . కాగా ఈ క్రమంలోనే బాలయ్య పుట్టినరోజు నాడు తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వైరల్ గా మారింది. మెగా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బాబీ దర్శకత్వంలో బాలయ్య తన 109వ సినిమాని చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

కాగ ఈ సినిమా కూడా మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . అయితే దీనిపై సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రెమ్యూనరేషన్ విషయంలో బాలయ్య ఆలోచించడు అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా..? లేదా అనేదే చూస్తుంటారు. అయితే ఫస్ట్ టైం బాలయ్య హైయెస్ట్ పారితోషకం అందుకోబోతున్నట్లు తెలుస్తుంది . ఇప్పటివరకు బాలయ్య అందుకుంది 10 కోట్లు మహా అయితే 15 కోట్లు.. ఈ విధంగానే ఆయన లెక్కలు ఉండేటివి.

కాని బాబి సినిమాకు మాత్రం బాలయ్య 20 నుంచి 25 కోట్ల అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అది కూడా బాబినే ఆ రేంజ్ లో పారితోషకం ఫిక్స్ చేసారట. బాలయ్య ఏనాడు ఎప్పుడూ కూడా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ప్రెసెంట్ బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ గా తీసుకోబోతున్న ఈ పారితోషకం డీటెయిల్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news