Moviesమెగా కోడలు కాబోతున్న లావణ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? మెగా...

మెగా కోడలు కాబోతున్న లావణ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? మెగా ఫ్యామిలీ కన్నా పెద్దదే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళిద్దరూ జూన్ 9న నాగబాబు నివాసంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటినుంచి వీళ్ళ నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా సినీ ఇండస్ట్రీలో చాలా సైలెంట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న లావణ్య ఇలా మెగా ఇంటి కోడలు కాబోతుండటంతో ఆమె బ్యాగ్రౌండ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి .

ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫాన్స్. కాగా లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించింది. లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టులో న్యాయవాది గా పనిచేస్తున్నారు . తల్లి ఉపాధ్యాయురాలుగా వర్క్ చేస్తున్నారు. స్కూల్ విద్యాభ్యాసం మొత్తం లావణ్య ది డెహ్రాడూన్ లోనే కంప్లీట్ అయింది . లావణ్యకి ఒక చెల్లి – తమ్ముడు కూడా ఉన్నారు. లావణ్య త్రిపాఠికి చదువులపై పెద్దగా ఆసక్తి లేదు .. అందుకే స్టడీస్ కన్నా ఎక్కువగా సినిమాల పైన ఫోకస్ చేసింది .

దీంతో నటిగా ప్రయత్నిస్తానని తన తండ్రికి చెప్పడంతో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏదైనా అని చెప్పారట . దీంతో లావణ్య అయిఇష్టంగానే ముంబై వచ్చి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది . ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ని గెలుచుకుంది లావణ్య త్రిపాఠి . అంతేకాదు ఆమె కు క్లాసికల్ డాన్స్ అంటే మహా పిచ్చి. ఆమెకి భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది .

అంతేకాదు ఆస్తులు పరంగా లావణ్య త్రిపాఠి కోడి వాళ్ళు పెద్ద గా రిచ్ కాకపోయినా..పరువు మర్యాదల విషయంలో మాత్రం మెగా ఫ్యామిలీ కంటే ఎక్కువే . లావణ్య త్రిపాఠి కుటుంబంలో ఇప్పటివరకు వేలెత్తి చూపించే పనులు ఎవరు చేయలేదు. అందరు వెల్ ఎడికేటెడ్..దీంతో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news