Moviesబిగ్ బ్రేకింగ్: మెగా హీరో వరుణ్-లావణ్య ల నిశ్చితార్ధం డేట్ వచ్చేసిందోచ్..ఆ...

బిగ్ బ్రేకింగ్: మెగా హీరో వరుణ్-లావణ్య ల నిశ్చితార్ధం డేట్ వచ్చేసిందోచ్..ఆ స్పెషల్ రోజే ముహుర్తం ..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు కొడుకే మెగా హీరో వరుణ్ తేజ్. మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వరుణ్ తేజ్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో భిన్న విభిన్న కథలను చూస్ చేసుకుంటూ స్టార్ హీరోగా మారిపోయాడు.

కాగా ప్రజెంట్ సినిమాల పరంగా టాప్ పొజిషన్లో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నాడు వరుణ్ అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే . వీళ్ళిద్దరూ కలిసి పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే వీళ్ల మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి బంధంగా మారుతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 9న హైదరాబాద్లో అతి తక్కువ మంది బంధువుల మధ్య ఈ నిశ్చితార్ధం వేడుక జరగబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇప్పటివరకు ఈ విషయాన్ని టాప్ సీక్రెట్ గా ఉంచినట్లు కూడా ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో వరుణ్ – లావణ్య ల పెళ్ళి మ్యాటర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట. వధూవరుల దుస్తులు, ఆభరణాలు ప్రముఖ డిజైనర్స్ రూపొందిస్తున్నారట.

ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కానున్నారట . నిహారిక వివాహం అనంతరం మెగా హీరోలు అందరూ ఒకచోట చేరినట్లు సమాచారం అందుతుంది. చూడాలి మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news