Movies"అహింస" మూవీ రివ్యూ : జనాలకు పెద్ద హింసే.. ఆ సినిమాని...

“అహింస” మూవీ రివ్యూ : జనాలకు పెద్ద హింసే.. ఆ సినిమాని టోటల్ కాపీకొట్టేసాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా డి రామానాయుడు గారు అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టి వెళ్లారు. ఆ తర్వాత సురేష్ బాబు , వెంకటేష్ , రానా దగ్గుబాటి .. ఆ పేరుని డబల్ స్థాయిలో ప్రమోట్ చేశారే కానీ ఎక్కడ తగ్గించలేదు . ఆ ఫ్యామిలీ నుండి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు అని తెలిసినప్పటి నుంచి దగ్గుబాటి అభిమానులు ఎంతో ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ డేబ్యూ సినిమా “అహింస”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటికి క్రితమే గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది, ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా ఎన్నోసార్లు వాయిదా పడి పడి ఫైనల్లీ ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. దీంతో సినిమా చూసిన జనాలు తమదైన స్టైల్ లో రివ్యూ ఇస్తున్నారు.

కాగా తేజ డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. అయితే సినిమా చూసిన తర్వాత జనాలు అభిప్రాయాన్ని మొత్తం మార్చేసుకున్నారు . సినిమా మొత్తం జయం సినిమా కి సీక్వెల్ గా ఉంది అని ..స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే నేచురాలిటీ ..అదే లవ్ స్టోరీ.. అదే యాక్షన్ సీన్స్ తెరకెక్కించారని చెబుతున్నారు . మరీ ముఖ్యంగా సినిమా పేరు అహింస అని పెట్టిన సినిమాలో హింస ఎక్కువగానే ఉందని ..హీరో హీరోయిన్ కోసం ఎంత తాపత్రయపడతారో లవ్ స్టోరీ లో బాగా చూపించిన ..విలనిజాని మాత్రం చాలా క్రూయాలిటీగా చూపించారని చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సీన్లు జయం – నువ్వు నేను చిత్రాన్ని తలపిస్తాయి అంటూ తేజ డైరెక్షన్ ని తప్పు పడుతున్నారు. తేజ డైరెక్షన్ ను కాపీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . సినిమా మొత్తానికి ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ ఒకటి హైలెట్గా నిలిచిందని ..గీతికతివారి అందంతో ఆకట్టుకున్న,, దగ్గుబాటి వారసుడు అభిరామ్ నటన అంతంత మాత్రమే ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఈ సినిమా ద్వారా ఏదో ఎక్స్పెక్ట్ చేసిన దగ్గుబాటి అభిమానులకు నిరాశ మిగులుతుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం చెప్పుకు రావడం గమనార్హం . మొదటి సినిమాతోనే హిట్ కొట్టాలనుకున్న అభిరామ్ ఫస్ట్ సినిమాతో అట్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నాడు . మరి కొంతమంది సీరియల్ కి ఎక్కువ సినిమాకి తక్కువ అంటూ ఓపెన్ గానే రివ్యూలు ఇస్తున్నారు . టోటల్గా దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అభిరామ్ ఫస్ట్ సినిమాతోనే డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అని క్లియర్గా అర్థం అయిపోతుంది . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news