Moviesసడెన్ గా రాత్రికి రాత్రి ఎన్టీఆర్ ఫ్యామిలీతో జంప్.. అసలు ఏమైందో...

సడెన్ గా రాత్రికి రాత్రి ఎన్టీఆర్ ఫ్యామిలీతో జంప్.. అసలు ఏమైందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే రెండో షెడ్యూల్ ఘనంగా ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే చిన్న గ్యాప్ తీసుకొని వెకేషన్ కి చెక్కేశాడు . దీనికి సంబంధించిన ఇమేజెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

నిన్న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో మెరిశారు జూనియర్ ఎన్టీఆర్ . ఆదివారం రోజు తన తాత గారి శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ రావడంతో అక్కడ అభిమానులు భారీ స్థాయిలో గుమ్మిగూడారు.. చిన్న తోపులాట కూడా జరిగింది . కాగా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లడానికి ఫిక్స్ అయిపోయాడు తారక్ . అందుకే ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తారక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

ఈ ఫొటోస్ లో తారక్ – లక్ష్మీ ప్రణతి దంపతులు వారితో పాటు పిల్లలు భార్గవ్ అభయ్ రామ్ కూడా చాలా క్యూట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. చిన్న కొడుకు భార్గవరామ్ అయితే తండ్రి చేయి పట్టుకొని విమానాశ్రయంలో అల్లరి అల్లరి చేశాడు . బుడిబుడి అడుగులు వేస్తున్నాడు . కాగా నిజానికి తారక్ షెడ్యూల్లో ఈ ఫారిన్ వెకేషన్ లేదట . కానీ తన కొడుకు స్కూల్ ఓపెన్ అవుతూ ఉండడంతో ఈలోపే తన కొడుకు హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలన్న క్రమంలో షూటింగ్ కి బ్రేక్ వేసి మరి తారక్ రాత్రికి రాత్రి వెకేషన్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంద . ఏది ఏమైనా సరే ఫ్యామిలీని మరోపక్క సినిమాలను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ తారక్ రియల్ హీరో అయ్యాడు. ప్రసెంట్ తారక్ కి సంబంధించిన లుక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news