Moviesకృతిశెట్టిని ఘోరంగా అవ‌మానించిన టాలీవుడ్ హీరో… కుమిలి కుమిలి బాధ‌ప‌డుతోందా…!

కృతిశెట్టిని ఘోరంగా అవ‌మానించిన టాలీవుడ్ హీరో… కుమిలి కుమిలి బాధ‌ప‌డుతోందా…!

మన సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్స్ మీద నడుస్తోంది. ఎవరికి అయినా వరుసగా హిట్లు వస్తుంటే ఇండస్ట్రీ అంతా వాళ్ళ వెంటే పరుగులు పెడుతుంది. అదే ఒకటి రెండు ప్లాప్ సినిమాలు వస్తే అటువైపు చూసేందుకు ఎవరు సాహసం చేయరు. అసలు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వాళ్ళ సినిమాలు కొనేందుకు కూడా ఎవరు ముందుకు రారు. ఇక హీరోయిన్ల విషయంలో ఈ సెంటిమెంట్లు మరీ ఎక్కువగా ఉంటాయి. హిట్‌ హీరోయిన్ వెంట ఇండస్ట్రీ పరుగులు పెడుతుంది.. ఆమె కాల్ షీట్ల కోసం ఎగబడుతుంది.

అదే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఫ్లాప్ సినిమాలు వరుసగా ఇస్తే ఆమెను పెద్ద ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేసేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతిశెట్టి కెరీర్‌ పెద్ద ప్రమాదంలో పడింది. యంగ్ బ్యూటీ కృతి శెట్టి పంజా వైష్ణవ్‌ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమాతో అమాంతం క్రేజ్ తెచ్చుకుంది. ఈ కుర్ర బ్యూటీ ఆ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. నానితో చేసిన శ్యాం సింగరాయ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. బంగార్రాజు హిట్ అయిన అందులో నాగార్జున – నాగచైతన్య ఇద్దరు ఉన్నారు.

బంగార్రాజు సినిమా కృతికి చివరి విజయం. ఆ తర్వాత ఆమె చేసిన అన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. రామ్ వారియర్ – నితిన్ మాచర్ల నియోజకవర్గం – ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి , తాజాగా నాగచైతన్య కస్టడీ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ వరుసగా పరాజయాలు వస్తూ ఉండడంతో తాజాగా ఆమెను టాలీవుడ్ లో ఓ మిడిల్ రేంజ్ హీరో సినిమాకు బుక్ చేశారట. అంతా ఓకే అనుకున్నారు.

కస్టడీ సినిమా ఎప్పుడు అయితే డిజాస్టర్ అయిందో ? ఆ యంగ్‌ హీరో ఐరన్ లెగ్ హీరోయిన్ ను మనం ఎక్కడ భరిస్తాం.. ఆమెను తీసేసి శ్రీలీలను బుక్ చేయమని చెప్పారట. ఆ హీరో సినిమాలో ఛాన్స్ రావడంతో ఉబ్బి తబ్బైన కృతి శెట్టి ఇప్పుడు ఆ సినిమా నుంచి తనను పక్కన పెట్టారని తెలియడంతో తనలో తానే కుమిలి కుమిలి బాధపడుతుంది అట. కస్టడీ సినిమాతో బంగార్రాజు మ్యూజిక్ రిపీట్ అవుతుందని కృతి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమా డిజాస్టర్ అవడంతో కృతి ఇండస్ట్రీ నుంచి త్వ‌ర‌గా ఫేడ‌వుట్ అయిపోతుందన్న చర్చలు మొదలైపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news