Moviesఎన్టీఆర్ బ్రదర్ గా ఆ తెలుగు హీరో.. కొరటాల ధింకింగ్ కి...

ఎన్టీఆర్ బ్రదర్ గా ఆ తెలుగు హీరో.. కొరటాల ధింకింగ్ కి రికార్డులు బద్ధలే..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు నందమూరి అభిమానులు . ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఫాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఆఫ్ కోర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కడ తగ్గకుండా హై రేంజ్ లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కొరటాల శివ.

ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి మరి స్పెషల్ సెట్స్ వేయిస్తున్నారు . అంతేకాదు ఏకంగా ఐదు కోట్లు పోసి మరి బాలీవుడ్ బ్యూటీ ని రంగంలోకి దించాడు . స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ కి ఈ సినిమా కోసం ఏకంగా ఐదు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చేసాడట కొరటాల శివ . అంతే కాదు ఐటెం సాంగ్ కోసం కూడా బాలీవుడ్ బ్యూటీ తో సహా మరో తొమ్మిది మంది బ్యూటీలను ఈ పాటలో మెరిసేలా చేస్తున్నారట . ఇప్పటివరకు ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రేంజ్ లో నందమూరి హీరోని చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

కాగా ఇదే క్రమంలో క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు కొరటాల శివ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. సినిమాలో ఎంత చిన్న క్యారెక్టర్ అయినా సరే స్టార్ ని పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట కొరటాల శివ . అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర కి స్టార్ హీరోని సెలక్ట్ చేసుకున్నాడట. నిజాని సినిమా స్టార్ట్ అయిన అరగంటకే ఈ పాత్ర చచ్చిపోతుంది . అయినా సరే ఆ చిన్న పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరోని ఫిక్స్ చేశాడట కొరటాల శివ. దీనికోసం ఆయనకి భారీగానే రెమ్యూనరేషన్ కూడా ముట్ట చెబుతున్నారట . సినిమా విషయంలో ఎక్కడ తగ్గకుండా ప్లాన్ చేసుకున్న కొరటాల శివ ఆ హీరో పేరుని కూడా బయటికి రానివ్వకుండా టాప్ సీక్రేట్ గా షూట్ ను కంప్లీట్ చేస్తున్నారట . ప్రతి విషయం లో సస్పెన్స్ మైంటైన్ చేస్తూ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు కొరటాల శివ. చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news