Movies"చరణ్ ఓ రంగులు మార్చే ఊసరవెల్లి".. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్...

“చరణ్ ఓ రంగులు మార్చే ఊసరవెల్లి”.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ కు ఎలాంటి క్రేజీ స్థానం అందుకున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన లాస్ట్ గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్నప్పటినుంచి రాంచరణ్ పేరు గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంటుంది . మరి ముఖ్యంగా ప్రెసెంట్ రాంచరణ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో తనకి ఓ సపరేట్ మార్క్ ఏర్పడింది .

అయితే అలాంటి ఓ స్టార్ హీరో పై బాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్ చేశారు . బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లిఖియా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి .అంతేకాదు మెగా ఫాన్స్ కి మండిస్తున్నాయి . రామ్ చరణ్ అపూర్వ డైరెక్షన్లో నటించిన సినిమా “జంజిర్” . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. రాంచరణ్ కెరియర్ లోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రియాంక చోప్రా ఆయనకి అక్కలా ఉంది అంటూ దారుణంగా ట్రోల్ చేశారు జనాలు .

ఈ క్రమంలోనే ఆయన గతంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే .. ఆ డైరెక్టర్లను హేళనగా చూస్తారని .. రంగులు మార్చే ఊసరవెల్లి అని అట్టర్ ఫ్లాప్ అయ్యాక కనీసం డైరెక్టర్ల మొఖం కూడా చూడడని.. డైరెక్టర్లతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడని ..ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయరు అని ఘాటుగా మాట్లాడిన్నట్లు ఓ న్యూస్ వైరల్ అయింది . అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు జంజీర్ డైరెక్టర్ . “నిజానికి రామ్ చరణ్ నేను దూరంగా ఉన్నాం అన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని.. చాలామంది మేము ఇద్దరం దూరంగా ఉన్నామంటూ ప్రచారం చేస్తున్నారని ..అయితే నేను ఇప్పటికి హైదరాబాద్ వెళ్లిన వాళ్ల ఇంట్లోనే స్టే చేస్తానని ..ఆయనని ఖచ్చితంగా మీట్ అవుతానని చెప్పుకొచ్చారు”. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అన్న వార్తలకు చెక్ పెట్టిన్నట్లైంది..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news