Moviesబిగ్ బ్రేకింగ్: పుష్ప 2 షూటింగ్ బస్సుకు ప్రమాదం.. పలువురి ఆర్టిస్టులకు...

బిగ్ బ్రేకింగ్: పుష్ప 2 షూటింగ్ బస్సుకు ప్రమాదం.. పలువురి ఆర్టిస్టులకు గాయాలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కాగా మల్టీ టాలెంటెడ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్పవన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప2 సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులను చకచక పూర్తి చేస్తున్నారు .

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమా షూటింగ్ బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది . తాజాగా మూడో షెడ్యూల్ అయిపోయినట్లు సమాచారం అందుతుంది. పుష్ప2 షూటింగ్ ముగించుకొని వస్తున్న ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. నేడు తెల్లవారుజామున పుష్ప2 సినిమాలో నటించిన పలువురు ఆర్టిస్టులు షూటింగ్ ముగించుకుని అనంతరం ప్రైవేట్ బస్సులో హైదరాబాద్కు వస్తున్నారు .

ఈ క్రమంలోనే హైదరాబాద్ – విజయవాడ హైవేపై మార్కెట్ పల్లి శివారులో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో బస్సు భాగాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి . ఇద్దరికీ తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది . ప్రమాదంలో గాయాలు పాలైన ఆర్టిస్టులను దగ్గరలోని ఆసుపత్రికి చేర్చినట్లు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదంలో హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది . విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు . దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news