Movies"ఏ అప్పుడు కళ్లు మూసుకుని ఉన్నావా..?".. కమల్ హాసన్ ని అడిగి...

“ఏ అప్పుడు కళ్లు మూసుకుని ఉన్నావా..?”.. కమల్ హాసన్ ని అడిగి గడిగేసిన సింగర్ చిన్మయి..!!

సినిమా ఇండస్ట్రీలో సింగర్ చిన్మయికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలు సినిమాలకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. సినిమాల్లో సింగింగ్ ఛాన్స్ అందుకని స్టార్ సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి.. సౌత్ లో స్టార్ సింగర్ స్టేటస్ ను దక్కించుకుంది . అలాగే మహిళలపై జరిగే వేధింపులు, విషయంలో చిన్మయి ఎప్పటికప్పుడు స్పందిస్తూ మగాళ్ళను చీల్చి చెండాడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఓ గాయనిగా ..ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ..ఓ సింగర్ గా సౌత్ ఇండస్ట్రీలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి రీసెంట్గా కమల్ హాసన్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే మీటూ ఉద్యమానికి తెర లేపింది చిన్మయినే. అప్పట్లో ఈ వివాదం ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోలీవుడ్ – టాలీవుడ్ – బాలీవుడ్ లో స్టార్
హీరోలను ..సెలబ్రిటీస్ లను ఏకి పారేసింది చినమ్యి. కాగా రీసెంట్ గా కమల్ హాసన్ రేజర్లకు మద్దతుగా చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ చిన్మయి శ్రీ పద సంచలనానికి తెరలేపింది. ” నేషనల్ గ్లోరీ కోసం పోరాడిన రేజర్ల వ్యక్తిగత భద్రత కోసం పోరాల్సిన పరిస్థితి వచ్చింది . భారతీయుల్లారా మన అటెన్షన్ కి ఎవరు అర్హులు.. క్రీడాకారులా..? లేక నేర చరిత్ర కలిగిన నేతల..? అంటూ కమలహాసన్ ట్వీట్ చేశారు .

దీనిపై చిన్మయి తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది . “ఓ మహిళపై ఇన్ని వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించినందుకు తమిళనాడులో ఓ మహిళా సింగర్ ని ఏకంగా 5 సంవత్సరాల పాటు నిషేధించారు. ఈ సంఘటన మీ కళ్ళముందే జరిగినా.. ఆ రచయితలు తో ఉన్న పరిచయాలు కారణంగా ఎవ్వరూ నోరు విప్పలేదు.. ఎవరు స్పందించలేదు .. తమ చుట్టూ జరిగే సంఘటన పట్టించుకోకుండా మాట్లాడే రాజకీయ నేతలు నీ జనాలు ఎలా నమ్మాలి ” అంటూ చిన్మయి స్ట్రైట్ గా కమల్ హాసన్ ని టార్గెట్ చేస్తూ ట్విట్ పోస్ట్ చేసింది . కమలహాసన్ దీనికి బదులు ఇవ్వకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొస్తున్నారు కోలీవుడ్ జనాలు. మరికొందరు చిన్మయికి పని పాట లేదంటూ ట్రో చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news