Moviesఅదే జరిగితే సంయుక్త మీనన్ చాప్టర్ క్లోజ్.. తట్ట బుట్ట సర్ధేయాల్సిందేనా..?

అదే జరిగితే సంయుక్త మీనన్ చాప్టర్ క్లోజ్.. తట్ట బుట్ట సర్ధేయాల్సిందేనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సంయుక్త మీనన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మలయాళీ బ్యూటీ అయినా సరే తెలుగులో క్రేజ్ సంపాదించుకొని స్టార్ హీరోయిన్లకు సైతం దడ పుట్టిస్తుంది. అమ్మడు చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉండడంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన న్యూస్లు తెగ వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే రీసెంట్గా విరూపాక్ష సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంయుక్త మీనన్ తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

యస్.. భీంలా నాయక్ సినిమాకి 70 లక్షలు తీసుకున్న సంయుక్త .. ఆ తర్వాత “సార్” సినిమాకు వచ్చేసరికి ఏకంగా రెండు కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది . ఇప్పుడు “విరూపాక్ష ” సినిమా హిట్ అవ్వడంతో ఆమె ఏకంగా ఆ సంఖ్యను డబ్బులు చేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోని సంయుక్త ఒక్కొక్క సినిమాకి 3.5-4 కోట్లు పారితోషకం డిమాండ్ చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఈ క్రమంలోనే మేకర్స్ సంయుక్త మీనన్ రేట్ చూసి దిమ్మ తిరిగిపోతుందట . అంతేకాదు సంయుక్త రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదట . ఒకవేళ నిజంగా అది జరిగితే మాత్రం సంయుక్త కెరియర్ చిక్కుల్లో పడినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో తట్ట బుట్ట సర్దేశి తన సొంత ఇండస్ట్రీకి వెళ్ళిపోవచ్చు అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news