Moviesపాపం..జబర్ధస్త్ యాంకర్ సౌమ్య తల్లి అన్ని కష్టాలు పడిందా..? తెలిస్తే కన్నీళ్లు...

పాపం..జబర్ధస్త్ యాంకర్ సౌమ్య తల్లి అన్ని కష్టాలు పడిందా..? తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

జబర్దస్త్ ప్రెసెంట్ యాంకర్ సౌమ్య గురించి పెద్దగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . కన్నడ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అమ్మడు ..తెలుగులో కూడా పలు సీరియల్స్ లో నటించింది . ఆ తరువాత జబర్దస్త్ లో యాంకర్ గా మారడానికి కారణమైంది . జబర్దస్త్ లో ఉన్న ప్లస్ ను నెగిటివ్లను గట్టిగా పట్టేసుకున్న సౌమ్యరావు .. తనదైన స్టైల్ లో ప్రజెంట్ హోస్ట్ చేస్తూ హ్యుజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది .

మదర్స్ డే సందర్భంగా ఆమె తన మదర్ కి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది . ఈ క్రమంలోని తన అమ్మగారు పడిన బాధను మరి ఏ అమ్మగారు కూడా పడకూడదు అంటూ ఎమోషనల్ వీడియోని షేర్ చేసింది సౌమ్యరావు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌమ్య రావు అమ్మగారికి క్యాన్సర్ . సుదీర్ఘంగా కొన్ని ఏళ్లపాటు క్యాన్సర్ తో పోరాడి..ఆమె తనువు చాలించిందట. అయితే ఆమె ను బ్రతికించుకోవడానికి సౌమ్య చాలా కష్టాలు పడిందట .

డబ్బులు ఎంతో ఖర్చు చేసిందట. దేవుడ్లను ప్రార్థించిందట. అయినా సరే ఆ దేవుడు ఎవరు కరుణించలేకపోయారు అంటూ ఆమె బాధ పడిపోయింది . ఈ క్రమంలోనే అమ్మతో గడిపిన వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది . ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. సౌమ్య రావు అమ్మ గురించి కామెంట్స్ చేస్తూ ఆమె పేరున ట్రెండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news