Movies"ఈసారి గుండు పగిలిపోవాల్సిందే"..పుష్ప2 నుంచి పిచ్చెక్కించే అప్డేట్.. !!

“ఈసారి గుండు పగిలిపోవాల్సిందే”..పుష్ప2 నుంచి పిచ్చెక్కించే అప్డేట్.. !!

ప్రజెంట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకి ఈ సినిమా సిక్వెల్ గా రాబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఎంతటి హైప్ ని క్రియేట్ చేశారో సినిమాపై సుకుమార్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పుష్ప వన్ లో బన్నీని చూపించిన తీరుకంటే పుష్ప2లో బన్నీని ప్రెసెంట్ చేసిన తీరు హాట్ టాపిక్ గా ట్రేండ్ అవుతుంది .

అంతేకాదు పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చీర కట్టుకొని అచ్చం అమ్మవారి గెటప్ లో రెడీ అయిన ఓ పోస్టర్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది . ఇప్పటివరకు ఏ టాలీవుడ్ స్టార్ హీరో చేయని పని అల్లు అర్జున్ చేసి తన క్రేజ్ ని అమాంతం పెంచేసుకున్నాడు . రీసెంట్ గా ఈసినిమాకి సంబంధించిన కీ షెడ్యూల్ కంప్లీట్ అయింది అంటూ సుకుమార్ తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చాడు. పుష్ప సినిమాలో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే .

పుష్ప వన్ సినిమాలో ఈయన పాత్ర చాలా తక్కువగా నడిచింది. సినిమా ఎండింగ్లో ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ క్రమంలోని పుష్ప 2 సినిమాలో మాత్రం ఫహద్ ఫజిల్ – అల్లు అర్జున్ మధ్య మంచి గూస్ బంప్స్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఫహద్ షూటింగ్ కంప్లీట్ చేసినట్టు డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు . అంతేకాదు ప ఫోటోని పోస్ట్ చేస్తూ అభిమానులకు కొత్త అప్డేట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే గుండు తో చూసిన భన్వర్ సింగ్ షెకావత్ ని చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఈసారి పుష్ప రాజ్ దెబ్బకి భన్వర్ సింగ్ షెకావత్ గుండు పగిలిపోవాల్సిందే అంటూ ఘాటుగా పంచ్ డైలాగ్స్ చెబుతున్నారు. దీంతో మరోసారి పుష్ప2 హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news