Movies"ఎక్కడున్నా ఆ విషయంలో తగ్గేదేలే"..అబ్బబ్బా..ఏం చేప్పావ్ బాసూ..!!

“ఎక్కడున్నా ఆ విషయంలో తగ్గేదేలే”..అబ్బబ్బా..ఏం చేప్పావ్ బాసూ..!!

టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. కేవలం పాన్ ఇండియా లెవల్ లోనే కాదు గ్లోబల్ స్థాయిలో ఆయన క్రేజ్ పెరిగిపోయింది .

ఆశ్చర్యం ఎంటంటే.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటున్నామంటూ ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు . అంతలా తన పేరుని మారుమ్రోగి పోయేలా చేసుకున్నాడు . ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ రెండు షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మరో షెడ్యూల్ కూడా ప్రారంభించబోతుంది. ఈ క్రమంలోనే చిన్న గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళాడు తారక్ . దీంతో దేవరకు కొంచెం బ్రేక్ పడింది.

ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోను షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది . “దేవర ఎట్ వర్క్ ” అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది . అంతేకాదు ఎక్కడ ఉన్న అది వెకేషన్ కాదు ..ఇంట్లో కాదు వర్కౌట్ విషయంలో మార్పు అనేది ఉండదు అంటూ జిమ్ ట్రైనర్ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో “దేవర” సినిమా కోసం తారక్ చాలా కష్టపడుతున్నాడని ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళిన తన వర్కౌట్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదని తెలుస్తుంది . అంతేకాదు ఫోటోలో టైట్ కండలతో.. ఉగ్రరూపంతో ఎన్టీఆర్ కనిపించిన తీరు జనాలను ఆకట్టుకుంటుంది. దీనితో సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news