Moviesకృతిని నమ్మించి నిలువునా ముంచేసిన ఆ తెలుగు హీరో.. అంతకు అంత...

కృతిని నమ్మించి నిలువునా ముంచేసిన ఆ తెలుగు హీరో.. అంతకు అంత అనుభవిస్తున్నాడుగా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని.. వచ్చిన తర్వాత తమ బొమ్మను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలి అని చాలామంది ముద్దుగుమ్మలకు ఆశగా ఉంటుంది. అయితే అందరూ ఇలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకోలేరు . సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి హెల్ప్ లేకుండా వచ్చినా కష్టపడకుండానే ఆఫర్స్ తెచ్చుకున్న టైం కలిసి రాకపోతే హిట్టు కొట్టిన హీరోయిన్లు కూడా హిట్టు కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . ప్రజెంట్ అదే పొజిషన్లో కొట్టుమిట్టాడుతుంది టాలీవుడ్ బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి .

పేరుకి కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో పాపులారిటీ సంపాదించుకొని తెలుగు ఇండస్ట్రీ ద్వారా ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది . మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత నటించిన మూడు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి .

ఈ క్రమంలోనే కృతి శెట్టి కెరియర్ మూడు హీట్లు మూడు ఫ్లాపులతో ఈక్వల్ గా బాలన్స్ అవుతుంది . కాగా త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్న కస్టడీ సినిమా పైనే ఆశలు పెట్టుకుని ఉంది. కాగా ఇలాంటి క్రమంలోనే కృతిని నమ్మించి మోసం చేసిన టాలీవుడ్ హీరో ఇతడే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్గా నటించింది కృతి శెట్టి .

ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ లకే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది . ఈ క్రమంలోనే ఈ సినిమా హిట్ అవుతుందని మొదట ఈ స్టోరీ వినగానే కృతికి కూడా ఎక్కడో డౌట్ కొట్టిందట. కానీ నితిన్ స్వయంగా కాల్ చేసి మరి నేను పూచీ ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ధీమాను వ్యక్తం చేశాడట . సీన్ కట్ చేస్తే సినిమా ఫ్లాప్ తర్వాత ఇప్పటివరకు నితిన్ కృతితో మాట్లాడిందే లేదు ..కనీసం ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఆమెకు ఓదార్పును కూడా ఇవ్వలేదట . ఈ క్రమంలోనే నితిన్ కృతిని నమ్మించి మోసం చేశాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news