Moviesసైలెంట్ షాకిచ్చిన నాని డైరెక్టర్.. పెళ్లి చేసుకోబోతున్న శ్రీకాంత్ ఓదేల.. అమ్మాయి...

సైలెంట్ షాకిచ్చిన నాని డైరెక్టర్.. పెళ్లి చేసుకోబోతున్న శ్రీకాంత్ ఓదేల.. అమ్మాయి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

మొదటి సినిమాతోనే ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని క్రేజ్ దక్కించుకున్న శ్రీకాంత్ ఓదెలా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో నాచురల్ యాక్టింగ్ కలిగిన హీరో నాని తో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా దసరా . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది .

మరీ ముఖ్యంగా నాని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 100 కోట్ల క్లబ్ లోకి చేరి నాని చిరకాల కోరికను తీర్చేసింది. హీరోయిన్గా కీర్తి సురేష్ కి సైతం మంచి ట్రాక్ రికార్డును ఇచ్చింది . ఈ క్రమంలోనే డెబ్యూ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదేల చాలా బాగా డైరెక్ట్ చేశారని ..అప్పట్లో జనాలు స్టార్స్ అందరూ ఆయన్ని ఓ రేంజ్ లో పొగిడేసారు. కాగా సినిమా లైఫ్ పరంగా టాప్ పొజిషన్లో దూసుకుపోతున్న శ్రీకాంత్ ఓదేల.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

పుష్ప 2 షూటింగ్ లో భాగమైన శ్రీకాంత్ ఓదేల .. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారట. ఆయన పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు .. ఆయన సొంతం మరదలని అంటూ సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారింది . అంతే కాదు కరీంనగర్లో వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తుంది . ఈ పెళ్లికి చాలా దగ్గర ఉంది బంధువులు మాత్రమే హాజరవుతున్నారు అని ..కేవలం నాని – కీర్తి సురేష్ తప్పిస్తే ఈ పెళ్లికి ఎవరు హాజరు కావడం లేదు అంటూ తెలుస్తుంది. అంతే కాదు పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్ కి అందర్నీ ఇన్వైట్ చేస్తాడట శ్రీకాంత్ . దీంతో శ్రీకాంత్ ఓదెలా సైతం ఓ ఇంటివాడు కాబోతున్నాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news