Moviesతెలిసి తెలిసి అదే తప్పు చేస్తున్న మెగాస్టార్.. ప్లీజ్ బాసూ ఇకనైన...

తెలిసి తెలిసి అదే తప్పు చేస్తున్న మెగాస్టార్.. ప్లీజ్ బాసూ ఇకనైన మారు..ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రొటీన్ బోరింగ్ కధలనే చూస్ చేసుకుంటున్నారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . గాడ్ ఫాదర్ – ఆచార్య లాంటి బోరింగ్ కధలను చూస్ చేసుకున్నాడు చిరంజీవి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇలాంటి క్రమంలోనే అదే ఏజ్ గల హీరో బాలకృష్ణ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ వందకోట్ల క్లబ్ లోకి చేరిపోతున్నారు . దీంతో మెగా ఫాన్స్ కూడా చిరంజీవిని రూట్ మార్చుకోవాలి అంటూ సజిస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమాలు చేసేవారు అలా సరికొత్త మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు .

ఆ విషయంలో బాలయ్య ట్రాక్ ని ఫాలో అయితే చిరంజీవి సక్సెస్ ట్రాక్ ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మెగా ఫాన్స్ కూడా ఇదే విధంగా ఆలోచిస్తూ ఉండడం గమనార్హం. చిరంజీవి రీసెంట్గా మరో మలయాళీ రీమేక్ సినిమాకు కమిట్ అయ్యాడు అన్న వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఓన్ గా కథలను కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తే బాగుంటుందని ..

ఆల్రెడీ వేరే హీరో తీసి హిట్టుకొట్టిన సినిమాలను మనం రీమేక్స్ చేస్తే ఏం బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ విషయం మెగాస్టార్ లాంటి స్టార్ సీనియర్ హీరోకి తెలియంది కాదు.. మరి ఎందుకు తెలిసి తెలిసి మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి తప్పులు చేస్తున్నాడు .. అన్నది ఇప్పుడు ఫాన్స్ కి కూడా అంతు చిక్కడం లేదు . చూద్దాం మరి మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news