Newsస‌లార్ నుంచి అదిరిపోయే పిక్ లీక్‌… ర‌గ్గుడ్ లుక్‌తో ప్ర‌భాస్‌ను చూస్తారా…...

స‌లార్ నుంచి అదిరిపోయే పిక్ లీక్‌… ర‌గ్గుడ్ లుక్‌తో ప్ర‌భాస్‌ను చూస్తారా… (ఫొటో)

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ అంచ‌నాలు ఉన్న సినిమా స‌లార్‌. కేజీయ‌ఫ్ లాంటి నేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. కేజీయ‌ఫ్‌, కేజీయ‌ఫ్ 2 త‌ర్వాత ప్ర‌భాస్‌తో స‌లార్ తెర‌కెక్కిస్తున్నాడు నీల్‌. స‌లార్ కూడా పార్ట్ 1, పార్ట్ 2గా రానుంది.

ప్ర‌భాస్ ఆదిపురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్ కే ఇలా చాలా సినిమాలు చేస్తున్నా స‌లార్ మీద అంచ‌నాలు అయితే స్కై రేంజ్‌లోనే ఉన్నాయి. సలార్ ది సాగాగా అనౌన్స్ చేసిన ఈ సాలిడ్ సాలిడ్ ఫ్రాంచైజ్ కోసం యావ‌త్ ఇండియ‌న్ సినిమా అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తాజాగా ఓ అదిరిపోయే లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

స‌లార్ షూటింగ్ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది. ప్ర‌భాస్ సలార్ షూట్ లో జాయిన్ అయ్యి… తన సినిమా క్రూ మెంబర్స్ తో ఈ ఫొటోలో క‌నిపిస్తున్నాడు. మంచి రగ్గుడ్ లుక్ తో డార్లింగ్ అదరగొట్టగా ఈ పిక్ ఇపుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఈ ఫొటో పిచ్చగా షేర్లు చేస్తున్నారు.

స‌లార్ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే రవి బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news