Moviesఅద్గది.. సమంత అంటే అది.. ఏకంగా పెద్ద తలకాయకే టెండర్ వేసిందిగా..!!

అద్గది.. సమంత అంటే అది.. ఏకంగా పెద్ద తలకాయకే టెండర్ వేసిందిగా..!!

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సమంతకి సంబంధించి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సమంత ఫేమ్ అంతకంతకు రోజురోజుకు పెరిగిపోతుంది. వరుసగా డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న సరే.. అమ్మడు ఎక్కడలేని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది . మరి ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకుని సౌత్ నుండి నార్త్ కి పాకేసిన బ్యూటీ లేటెస్ట్ గా హాలీవుడ్ ఫిలిం కి సైన్ చేసిందట . చెన్నై స్టోరీ టైటిల్ తో ఇంగ్లీష్ మూవీ తెరకెక్కుతుండగా.. హీరోయిన్ గా సమంత ను ఎంచుకున్నారట .

ఇది విదేశీ యువకుడు చెన్నై అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ అంటూ తెలుస్తుంది.హాలీవుడ్ యాక్టర్ వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నాడట. ఫిలిప్ జాన్ చిత్ర దర్శకుడు కాగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ మేరకు సమాచారం అందుతుంది. ఈ సినిమాకి ఫిలిప్ జాన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రానుంది అంటూ తెలుస్తుంది . ప్రస్తుతం సమంత ఖుషి సినిమా షూట్స్ లో బిజీ బిజీగా ఉంది .

శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుంది . అలాగే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది . ఇలా క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసిన సమంత పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది, ఏది ఏమైనా సరే ఈ మూడు సినిమాలు హిట్టయితే సమంత కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news