Newsత‌న‌కు లైఫ్ ఇచ్చిన వ్య‌క్తి రుణం తీర్చుకోబోతోన్న ఎన్టీఆర్‌… ఆ రుణం...

త‌న‌కు లైఫ్ ఇచ్చిన వ్య‌క్తి రుణం తీర్చుకోబోతోన్న ఎన్టీఆర్‌… ఆ రుణం ఇదే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వ‌చ్చి రెండు ద‌శాబ్దాలు దాటేసింది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో విజ‌యాలు ఎన్టీఆర్ సొంతం అయ్యాయి. ఎన్టీఆర్ కెరీర్ ప‌రంగా ఇప్ప‌ట‌కీ తిరుగులేని స్టార్ హీరో. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ సినిమాతో పాటు ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ల‌లో వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా సినిమాల‌లో న‌టిస్తున్నాడు.

అటు వెండితెర‌తో పాటు ఇటు స్మాల్ స్క్రీన్ మీద కూడా ఎన్టీఆర్ సంద‌డి చేస్తూ ఉంటాడు. ఆరేళ్ల క్రిత‌మే ఎన్టీఆర్ బిగ్‌బాస్ షోను తెలుగులో లాంచ్ చేసిన‌ప్పుడు మా టీవీలో హోస్ట్‌గా అద‌ర గొట్టేశాడు. బిగ్‌బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ ద్వారా ఈ షోను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో ఎన్టీఆర్ ఛ‌రిష్మా, ఆ హోస్టింగ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డింది.

ఆ త‌ర్వాత మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌కు కూడా ఎన్టీఆర్ హోస్ట్‌గా వెళ్లాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ రెండు సీజ‌న్ల‌లో ఈ రెండు ప్రోగ్రామ్‌లు పెద్ద హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు ఈటీవీ ఎన్టీఆర్ క్రేజ్ వాడుకుని ఓ టాక్ షోకు ప్లాన్ చేస్తోంది.

ఈ మెగా టాక్ షో ప్ర‌స్తుతం డిజైనింగ్ ద‌శ‌లో ఉంది. ఈటీవీ ఇటీవ‌ల ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈటీవీ విన్ పేరుతో లాంచ్ అయిన ఈ యాప్‌లో స‌బ్‌స్క్రిఫ్ష‌న్ రేట్లు పెట్టి థియేట‌ర్ల‌లో రిలీజ్ కాని సినిమాలు ఇక్క‌డ రిలీజ్ చేస్తున్నారు. ర‌విబాబు అవును కూడా ఇందులోనే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈటీవీ కూడా ఎన్టీఆర్ క్రేజ్ వాడుకుని ఓ మెగాటాక్ షో ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తోంది.

ఎన్టీఆర్‌ను హీరోగా లాంచ్ చేసింది రామోజీరావే. ఆయ‌న ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్లోనే ఎన్టీఆర్ తొలి సినిమా నిన్ను చూడాల‌ని వ‌చ్చింది. ఎన్టీఆర్ ఆ రుణం తీర్చుకోవాల‌నే ఈటీవీలో ఈ టాక్ షో చేసేందుకు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఈటీవీ వాళ్లు మాత్రం ఎన్టీఆర్ టాక్ షోతో ఈటీవీ విన్‌కు, ఈటీవీకి ఓ రేంజ్‌లో క్రేజ్ వ‌చ్చే స్ట్రాట‌జీతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news