Moviesఎన్టీఆర్ "దేవర" టైటిల్ వెనుక ఇంత పెద్ద కధ ఉందా..? ఇంటర్వెల్...

ఎన్టీఆర్ “దేవర” టైటిల్ వెనుక ఇంత పెద్ద కధ ఉందా..? ఇంటర్వెల్ సీన్ లో ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ గా చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా తోనే ఎన్టీఆర్ బాలీవుడ్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు . మరి ముఖ్యంగా తారక్ ఇప్పుడు ఇలాంటి పోసిషన్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిన్న ట్విట్ చేసిన గ్లోబల్ స్థాయిలో వైరల్ అవుతుంది . హాలీవుడ్ డైరెక్టర్ లు సైతం మేము ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన చిన్న విషయాన్ని గ్లోబల్ స్ధాయిలో ట్రెండ్ చూస్తున్నారు అభిమానులు . ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ నెక్స్ట్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేశారు మేకర్స్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు “దేవరా” అనే టైటిల్ ఫిక్స్ చేశారు . నిజానికి “దేవర” అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టడానికి కారణం ..ఈ సినిమాలో తారక్ డ్యూయెల్ రోల్ నటించబోతున్నాడట.

ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర పేరు “దేవర” . ఆ పాత్ర పేరే ఈ సినిమాకి పెట్టారు. అంతేకాదు ఈ సినిమాలో యంగ్ జనరేషన్ గా ఉన్న తారక్ రోల్ చాలా తక్కువగా ఉంటుంది అని.. దేవర పాత్రే సినిమాకి కీలక ప్రధానమని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే “దేవర” అనే టైటిల్ తోనే తెలియని గూస్ బంప్స్ తెప్పించిన తారక్ .. సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ రికార్డులు బద్దలు కొడతాడు అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . 5 ఏప్రిల్ 2024న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news