Moviesపూర్తిగా మారిపోయిన పూజా హెగ్డే .. అభిమానుల కోసం ఏకంగా అలాంటి...

పూర్తిగా మారిపోయిన పూజా హెగ్డే .. అభిమానుల కోసం ఏకంగా అలాంటి పని..ఒక్కసారిగా ఇంత మార్పు తట్టుకోగలరా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు నాలుగు హిట్లు – మూడు కోట్లు రెమ్యూనరేషన్ అంటూ క్రేజీ టాక్ దక్కించుకున్న పూజా ..ప్రెసెంట్ ఐదు ఫ్లాపులు నాలుగు ట్రోలింగ్ లు అన్న రేంజ్ లో దిగజారిపోయింది . మరీ ముఖ్యంగా పూజ హెగ్డే ఈ మధ్యకాలంలో చేసిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో పూజ హెగ్డే కెరియర్ కెరియర్ గ్రాఫ్ డౌన్ ఫాలో అయింది .

మరి ముఖ్యంగా పూజ హెగ్డే సల్మాన్ ఖాన్ నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో బాలీవుడ్ లో కూడా అమ్ముడు పరువు పోయినట్లుంది . ఈ క్రమంలోని సుదీర్ఘంగా సినిమాలకు బ్రేక్ చెప్పి మరి పూజా హెగ్డే టూర్స్ ఎంజాయ్ చేస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా శ్రీలంకకు వెకేషన్ కి వెళ్ళిన పూజా హెగ్డే అక్కడికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి కొత్త రకమైన ఫీలింగ్ ను కలగజేస్తుంది .

ఈ క్రమంలోనే శ్రీలంకలో ఆటో ఎక్కిన పూజా హెగ్డే ఫోటో ఏ విధంగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . శ్రీలంకలో మరికొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది పూజ . ఈ క్రమంలోనే చాలా హాట్ గా ఉండే మిడ్డీలో హ్యాట్ పెట్టుకొని చేతులు వెనక్కి పెట్టి ఫోజులు ఇవ్వడం కుర్రాళ్లకు కొత్తగా అనిపించింది. అఫ్ కోర్స్ సినిమాలో హీరోయిన్స్ చాలామంది బోల్డ్ గా ఫొటోస్ ఇవ్వడానికి ఇష్టపడతారు కానీ పూజ హెగ్డే కోసం నార్మల్ గా ఫోజులు ఇవ్వడం కొంచెం ఆలోచించే విధంగా ఉంది . పూజా హెగ్డే సినిమా అవకాశాల కోసమే ఇలా కొంచెం కొంచెం గా తగ్గుతుందా అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి .

అంతేకాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా పూజా హెగ్డే బాగా తగ్గిందని .. తన వద్దకు వచ్చే డైరెక్టర్స్ డిమాండ్ చేయడం కాదు ..వాళ్ళు ఎంత ఇస్తే అంతే పుచ్చుకునేంత కండిషన్ కి సెట్ అయిపోయింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . ఏది ఏమైనా సరే ఐదు మంది హీరోలు పూజా హెగ్డే కి డిజాస్టర్ ఇచ్చిన సరే ..వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయకుండా పూజ నే ట్రోల్ చేస్తున్నారు అంటే ..దీని వెనక ఎవరో హస్తముంది అని పూజ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు . చూద్దాం మరి పూజ హెగ్డే ఇలాంటి ట్రోలింగ్ నుంచి ఎలా బయటపడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news