Movies"ఒక్కే ఒక్క ట్వీట్..అడ్డంగా ఇరుక్కుపోయిన మహేశ్ బాబు".. సొంత ఫ్యాన్సే ఏకిపారేస్తున్నారే..!!

“ఒక్కే ఒక్క ట్వీట్..అడ్డంగా ఇరుక్కుపోయిన మహేశ్ బాబు”.. సొంత ఫ్యాన్సే ఏకిపారేస్తున్నారే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రెటీస్ ని కూడా జనాలు ఏకిపారేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఏ స్టార్ సెలబ్రిటీ దొరుకుతారా ..? అంటూ కాచుకొని కూర్చున్న జనాలకు అడ్డంగా దొరికిపోయాడు టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు . ఎస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ట్రోలింగ్ ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియా మొత్తానికి మహేష్ బాబు పేరుని పరమ చెత్త కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

ఆశ్చర్యం ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆయనని నిందిస్తూ ఉండడం గమనించాల్సిన విషయం. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిన్న చిత్రం ‘మేమ్ ఫేమస్’. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తుండడంతో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు . అంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు రివ్యూ ఇవ్వడం అశ్చర్యకరంగా అనిపించింది .

మహేష్ బాబు ఇంత చిన్న సినిమాకి రివ్యూ ఇవ్వడం అందరికీ షాకింగ్ అనిపిస్తుంది. “మేం ఫేమస్ బ్రిలియంట్ ఫిలిం .. సుమన్ అద్భుతంగా నటించి దర్శకత్వం చేశారు “అంటూ మహేష్ బాబు ఓ రేంజ్ లో పొగిడేసారు . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆయనని ట్రోల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జనాలు ” ఇంకెందుకు అన్న మళ్లీ పెళ్లి సినిమా కి కూడా రివ్యూ ఇచ్చేయ్ అన్న” అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . ఒక చిన్న చిత్రానికి మహేష్ బాబు పనికట్టుకుని ట్వీట్ చేయడం విడ్డూరంగా ఉంది అంటుంటే .. మరికొందరు లాగిన్ డీటెయిల్స్ పీఆర్ టీం కి ఇచ్చేశావ్ గా.. మహేష్ ఇంత నెగ్లెజెన్సీగా బిహేవ్ చేస్తాడని అనుకోలేదు అంటూ మండి పడుతున్నారు. అసలు ఈ చిత్రాన్ని మహేష్ బాబు చూశారా చూడలేదా ..? అంటూ జనాలు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో మహేష్ బాబు పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news