Newsఎన్టీఆర్ బ‌ర్త్ డే గిఫ్ట్‌…. NTR 30 నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్‌…...

ఎన్టీఆర్ బ‌ర్త్ డే గిఫ్ట్‌…. NTR 30 నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్‌… పండ‌గ చేస్కోండి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ‌తేడాది వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్‌కు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత కొర‌టాల శివ సినిమా కోసం యేడాదికి పైగా వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వీకపూర్ హీరోయిన్ గా కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా మూడో షెడ్యూల్ కూడా షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది 30వ సినిమాగా రానుంది. ఈ సినిమా త‌ర్వాత కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా రానుంది. ఇక కొర‌టాల – ఎన్టీఆర్ కాంబోలో ఇప్ప‌టికే వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

దీంతో ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌స్తోన్న రెండో సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ మే 20ఎన్టీఆర్ బర్త్ డే కోసం అంద‌రూ ఈగ‌ర్‌గా వెయిటింగ్ చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ నుంచి గ్లింప్స్ లాంటి టీజ‌ర్ వ‌దులుతార‌ని.. ఇందుకు త‌గ్గ ప్లానింగ్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.

కొర‌టాల త‌న సినిమాల అప్‌డేట్స్ విష‌యంలో చాలా ట్విస్టులు ఇస్తూ ఉంటారు. ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా ఓ పోస్ట‌ర్‌నే వీడియో రూపంలో గ్లింప్స్‌లాగా రిలీజ్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిసింది. మ‌రి త‌మ అభిమాన హీరో బ‌ర్త్ డే కానుక‌గా చిన్న వీడియో వ‌చ్చినా ఎన్టీఆర్ అభిమానుల ఆనందం మామూలుగా ఉండ‌ద‌నే చెప్పాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news