Moviesఛీ ఛీ.. ఆ హీరోలను చూసి నా మీద నాకే అసహ్యం...

ఛీ ఛీ.. ఆ హీరోలను చూసి నా మీద నాకే అసహ్యం వేసేది .. స్టార్ విలన్ షాకింగ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫేడ్ అవుట్ అయిపోయిన స్టార్ హీరోస్.. హీరోయిన్స్.. క్యారెక్టర్ ఆర్టిస్టులు మళ్ళీ పలు యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ విలన్ గా పాయసంపాదించుకున్న విలన్ శరత్ సక్సేన తన లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులకు తెలియజేశారు.

శరత్ సక్సేన.. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేరు. కానీ బన్నీ సినిమాలో కాలు లేని ఓ పాత్ర చేసిన నటుడిగా ఎంతో ప్రశంసలు దక్కించుకున్నాడు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పుడు విలన్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది శరత్ సక్సేనా నే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసిన తెలుగు – తమిళ్ – హిందీ – మలయాళం భాషలో ఎన్నో సినిమాల్లో నటించారు. విలన్ గా కొన్ని వందలకు పైగా సినిమాలను నటించి గత 30 సంవత్సరాలుగా అదే విలనిజాని పోషిస్తున్నారు .

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయిపోయారు. “ఒకానొక టైంలో ఇండస్ట్రీలో ఎందుకు పని చేస్తున్నానా అంటూ విరక్తి కలిగిందని .. ప్రతి రోజు అదే మేకప్ వేసుకోవడం.. ఆ హీరోల చేతుల్లో తన్నులు తినడం జీవితం గా మారిపోయింది అంటూ బాధ పడ్డారని చెప్పుకొచ్చారు.

మరీ ముఖ్యంగా సౌత్ లో హీరోల ఎంట్రీ సీన్స్ కే పరిమితం అని ..అయితే వారిని చూపించడానికి విలన్స్ ని నాలుగు దెబ్బలు కొట్టి మరీ డైరెక్టర్ లి విలనిజాని పండిస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఒకానొక టైంలో ఇదేనా నా బ్రతుకు అంటూ విరక్తి వచ్చిందని .. సినిమాలు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నానని.. కానీ డబ్బులు సరిపోక ఇండస్ట్రీలోనే ఉండాలి అంటూ ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చారు . దీంతో రీసెంట్గా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news