Moviesబిగ్ బాస్ 7: ఈసారి రూల్స్ మారిపోయాయోచ్.. ఇక అంత ఓపెన్...

బిగ్ బాస్ 7: ఈసారి రూల్స్ మారిపోయాయోచ్.. ఇక అంత ఓపెన్ గానే.. ఫ్యాన్స్ కి పండగే పండగా..!!

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ లోకి వచ్చిన జనాల జీవితాలు మారిపోతూ ఉండడంతో ఈ షోలోకి రావాలి అని ..పాపులారిటీ సంపాదించుకోవాలి అని .. చాలామంది ఆశ పడుతూ ఉంటారు . అయితే ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఇప్పటికి ఆరు సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే ఏడవ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోని ఈ షో కి ఈసారి రానా దగ్గుబాటి హోస్ట్ చేయబోతున్నారు అంటూ కొన్ని న్యూస్ లు వైరల్ అవుతున్నాయి.

ఇన్నాళ్లు ఈ షో ని హోస్ట్ చేసిన నాగార్జున ఇక ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కేవలం హోస్టే కాదు ఈసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారిపోతున్నాయట. అప్పటిలా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ వెంటనే హౌస్ నుంచి బయటికి వచ్చేయరట. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ తో కూడా సరికొత్త గేమ్ ప్లాన్ చేశారని తెలుస్తుంది . మరి ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో ఈసారి హై రేంజ్ పేమెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట .

అంతేకాదు చిన్నా చితక ఆర్టిస్టులను కాకుండా బడా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీస్ ని కూడా రంగంలోకి దించుతున్నారట . అంతేకాదు ఓ సీక్రెట్ రూమ్ ఉండబోతుందని ..ఆ సీక్రెట్ రూంలో డివర్స్ తీసుకున్న జంటను ఉంచబోతున్నారని.. ఈ దెబ్బతో షో టి ఆర్ పి రేటింగ్స్ పిక్స్ చేరుకోవాల్సిందే అని చెప్తున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. ఈ సీజన్లో యాంకర్ ఉదయభాను, యాంకర్ రష్మి , సుడిగాలి సుదీర్ పాల్గొనబోతున్నట్లుగా న్యూస్ లు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news