Moviesనాలుగు సినిమాల్లో అదే తప్పు .. అదే కృతి శెట్టి కొంప...

నాలుగు సినిమాల్లో అదే తప్పు .. అదే కృతి శెట్టి కొంప ముంచేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం కాదు.. వచ్చిన తర్వాత హీరోయిన్ గా వచ్చిన ట్రాక్ రికార్డును అలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి . లేదంటే ఆ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో కనుమరుగైపోతుంది . కాగ అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అందాలు ముద్దుగుమ్మ కృతి శెట్టి అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . మనకు తెలిసిందే మొదటి సినిమాతోనే కేక పట్టించే హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత చేసిన రెండు సినిమాలలోనూ తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది .

అయితే ఏ దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ .. ఆ తర్వాత నటించిన మూడు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టి నటించి.. భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన “కస్టడి” సినిమా హ్యూజ్ ఫ్లాప్ టాక్ ను నమోదు చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కృతిశెట్టి ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేనా కృతి శెట్టి ఈ సినిమా హిట్ అవుతుందని ధీమా కూడా వ్యక్తం చేసింది .

అయితే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయిపోయింది . దీంతో వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ రికార్డ్ నెలకొల్పింది. అయితే ఎందుకు కృతి శెట్టి వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలను చూస్ చేసుకుంది అన్నది ఇప్పుడు వైరల్ అవుతుంది . అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..కృతి శెట్టి నటించిన లాస్ట్ 4 సినిమాలలోను కీలక పాత్రలో కనిపించలేదని.. కేవలం గ్లామరస్ పాత్ర గాని కనిపించిందని.. ఆ కారణంగానే సినిమాలు ఫ్లాప్ అయ్యాయని చెప్పుకొస్తున్నారు. నాలుగు సినిమాల్లోనూ కృతి క్యారెక్టర్ కు పెద్దగా వాల్యూ ఉండదు అని.. హీరోయిన్ అంటే హీరోయిన్ అంతే ..అందుకే కృతి ఫాన్స్ హిట్ చేయలేకపోయారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కృతి చేసిన తప్పే ఆమె పాలిట ఇప్పుడు శాపంగా మారి కెరియర్ ఫ్లాప్ అవుతున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. చూడాలి మరి నెక్స్ట్ కృతి ఎలాంటి ప్లాన్ తో మనం ముందుకు రాబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news