MoviesTL రివ్యూ: విరూపాక్ష‌

TL రివ్యూ: విరూపాక్ష‌

మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన సినిమా విరూపాక్ష‌. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ ఈ సినిమా తెర‌కెక్కింది. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించ‌గా.. సీనియ‌ర్ నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మించారు. సాయితేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక న‌టించిన సినిమా ఇది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:
రుద్రవనం అనే ఊరిలో క్షుద్రపూజలు చేస్తున్నారని కార‌ణంతో ఒక కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు చంపేస్తారు. ఆ జంట కుమారుడిని ఆ ఊరు నుంచి పంపేస్తారు. ఇది జ‌రిగాక చాలా యేళ్ల‌కు సూర్య (సాయి ధరమ్ తేజ్) తన తల్లితో పాటు ఆ ఊరు రుద్రవనం ఊరు వస్తాడు. రుద్రవనం తన తల్లి ఊరు. దీంతో ఆ ఊరుకు సాయితేజ్‌కు అనుబంధం ఉంటుంది. అక్క‌డ నందిని (సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం ట్రై చేస్తోన్న క్ర‌మంలో ఆ ఊరిలో వ‌రుస‌గా మ‌నుష్యులు చ‌నిపోతూ ఉంటారు. దీంతో ఆ ఊరు భ‌యంతో వ‌ణికిపోతూ ఉంటుంది. అస‌లు అక్క‌డ మ‌నుష్యులు వ‌రుస‌గా ఎందుకు ? చ‌నిపోతున్నారు. ఆ ఊరి చావుల వెన‌క ఉన్న ర‌హ‌స్యం ఏంటి ? ఈ మిస్ట‌రీని సూర్య ఎలా చేధించాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ దండు రాసుకున్న కథ బిగ్గెస్ట్ ఎస్సెట్‌. అంతే గొప్ప‌గా ఈ క‌థ‌ను తెర‌మీద చూపించాడు. న‌టీన‌టుల్లో సాయితేజ్ సూర్య పాత్ర‌లో చాలా బాగా న‌టించాడు. థ్రిల్ల‌ర్ సీన్ల‌లో రియ‌లిస్టిక్ యాక్టింగ్‌తో మెప్పించాడు. సెకండాఫ్‌లో యాక్ష‌న్ సీన్ల‌తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్ల‌లో సాయితేజ్ న‌ట‌న అదిరిపోయింది. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా తన నటనతో మెప్పించింది. హారర్ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. ఇక కీలక పాత్రలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు.

దర్శకుడు కార్తీక్ కథలో ఉన్న సస్పెన్స్ బాగా మెయింటైన్ చేసాడు. పైగా హారర్ సీన్ల పిక్చ‌రైజేష‌న్ బాగుంది. ఇక ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెర‌కెక్కింది. ద‌ర్శ‌కుడు రాసుకున్న సీన్లు కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. ఇక విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అదుర్స్‌. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ ఊహించని టర్న్ తీసుకుని.. అస‌లు మెయిన్ విలన్ ఎవరూ ? అన్న‌ది ఎవ్వ‌రి ఊహాల‌కు అందదు.

అయితే హీరో, హీరోయిన్ల ప్రేమ సీన్లు ఇంకా బెట‌ర్‌గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో కొన్ని కీల‌క సీన్లు కూడా ఇంకా బెట‌ర్‌గా డిజైన్ చేసుకుని ఉంటే సినిమా రేంజ్ మ‌రోలా ఉండేది. ఇక ప్రేక్ష‌కుడు సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది ? హీరో ఆ చావుల రహస్యాన్ని ఎలా కనిపెడతాడు? ఊరును ఎలా ? కాప‌డ‌తాడు అన్న ఉత్కంఠ బాగా క‌లుగుతుంది. హీరోయిన్ పాత్రకు – రాజీవ్ కనకాల పాత్ర మధ్య ట్రాక్ ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
టెక్నిక‌ల్‌గా మంచి క‌థ ఎంచుకోవ‌డంలోనే ద‌ర్శ‌కుడు స‌గం స‌క్సెస్ అయ్యాడు. కార్తీక్ దండుకు డైరెక్ష‌న్ కొత్త అయినా.. సుకుమార్ స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్ గా సాగింది. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది. ఆర్ ఆర్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. ఎడిటింగ్ కూడా బాగుంది. దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి సినిమా తెర‌కెక్కించిన నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌ను అభినందించాలి.

ఫైన‌ల్‌గా…
విరూపాక్ష అంటూ వచ్చిన ఈ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు స‌రికొత్త ఫీల్ ఇస్తుంది. ద‌ర్శ‌కుడు రాసుకున్న హ‌ర్ర‌ర్ స్టోరీ, సీన్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, టేకింగ్ అదిరిపోయాయి. కొన్ని సీన్లు స్లోగా ఉన్నా ఓవ‌రాల్‌గా ఈ సినిమా హ‌ర్ర‌ర్ , థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌ను పిచ్చ‌పిచ్చ‌గా మెప్పిస్తుంది. అన్ని వ‌ర్గాల‌ను కూడా ఆక‌ట్టుకుంటుంది. సాయితేజ్ కెరీర్‌లో మంచి హిట్ సినిమాగా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఫైన‌ల్ పంచ్‌: విరూపాక్ష సూప‌ర్ థ్రిల్ల‌ర్‌… ఎంజాయ్‌

విరూపాక్ష TL రేటింగ్‌: 3.25 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news