Moviesస‌ర్దార్ పాపారాయుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిన హీరో తెలుసా.. ఎంత...

స‌ర్దార్ పాపారాయుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిన హీరో తెలుసా.. ఎంత దుర‌దృష్టం అంటే..!

అన్న‌గారు ఎన్టీఆర్ న‌టించిన అనేక చిత్రాల్లో రికార్డు స్థాయిలో విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా.. అన్న‌గారి ప్ర‌తిభ‌ను మ‌రోసారి దేశానికి చాటి చెప్పిన సినిమా స‌ర్దార్ పాపారాయుడు. ఈ సినిమాను ద‌ర్శ‌కు డు దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌నసు పెట్టి చేశారు. డైలాగులు, స్క్రీన్‌ప్లే… క‌థ కూడా ఆయ‌నే చేకూర్చారు. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ విజ‌య‌వాడ దుర్గాక‌ళామందిరంలో జ‌రిగింది.

అప్ప‌ట్లో హోట‌ళ్లలో జ‌రిగే సంస్కృతి లేదు. ఏ కార్య‌క్ర‌మం అయినా..ప్ర‌జ‌ల మ‌ధ్య జ‌రిగితేనే దానికి మ‌రిం త ప్ర‌చారం వ‌చ్చేద‌ని దాస‌రి న‌మ్మేవారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య చేసుకుంటే.. ప్ర‌జ‌లు పెద్ద‌గా రార‌ని.. చెప్పేవారు. ఇలా.. స‌ర్దార్ పాపారాయుడు సినిమా 100 దినోత్స‌వ పండుగ అట్ట‌హాసంగా జ‌రిపించారు. చిత్రం ఏంటంటే.. ఈ సినిమా వంద రోజుల పండుగ‌లు.. ఒకే రోజు ఐదు చోట్ల జ‌ర‌గ‌డం.. విశేషం.

అంతేకాదు.. ఈ ఐదు చోట్ల పంక్ష‌న్ల‌కు కూడా.. ఎన్టీఆర్‌, శ్రీదేవి హాజ‌ర‌య్యారు. రాజ‌మండ్రిలో ఏర్పాటు చేసిన శ‌త దినోత్స‌వ వేడుక‌ల‌కు మోహ‌న్ బాబు కూడా హాజ‌ర‌య్యారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన దానికి ఆయ‌న రాలేదు. ఇదిలావుంటే.. రాజ‌మండ్రిలో దాస‌రి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ఈ సినిమా క‌థ‌ను మొద‌ట్లో అన్న‌గారిని దృష్టిలో పెట్టుకుని రాయ‌లేద‌న్నారు.

కొన్ని కొన్ని పాత్ర‌ల‌కు మార్పులు చేర్పులు చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. అదేవిధంగా శ్రీదేవిని కూడా ముందు అనుకోలేద‌న్నారు. రామారావు స్థానంలో శోభ‌న్‌బాబును అనుకున్న‌ట్టు చెప్పారు. అయితే. క‌థ విన్నాక‌.. త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్ప‌డంతో.. మౌనంగా ఉండిపోయామ‌ని..త‌ర్వాత‌.. విష‌యం తెలిసి..అన్న‌గారు.. త‌న‌తో తీస్తారా అని అడ‌గ‌డంతో ఇంత‌క‌న్నామ‌హాభాగ్యం ఏముంటుంద‌ని ఆయ‌న‌తో తీసిన‌ట్టు దాస‌రి వెల్ల‌డించారు. శ్రీదేవి స్థానంలో జ‌య‌ప్ర‌ద‌ను అనుకున్న‌ట్టు చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news