Moviesమాజీ ప్రియుడు మోజులో ఐశ్వ‌ర్య‌... అందుకే అభిషేక్‌కు విడాకులు...?

మాజీ ప్రియుడు మోజులో ఐశ్వ‌ర్య‌… అందుకే అభిషేక్‌కు విడాకులు…?

మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌కు విడాకులు ఇవ్వబోతుందన్న వార్త గత కొద్ది నెలలుగా జాతీయ మీడియాను ఒక కుదుపు కుదుపుతుంది. నాగచైతన్య – సమంత విడాకులకు ముందు ఎలాంటి ? వార్తలు వచ్చాయో.. ఇప్పుడు ఐశ్వర్య – అభిషేక్ విడాకుల విషయంలోనూ అలాంటి వార్తలే వస్తున్నాయి. వీరిద్దరూ గత‌ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు.

ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి ఉంటుంటే.. అభిషేక్ ఇటు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ ఇప్పటికే మానసికంగా విడిపోయారని.. త్వరలోనే అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక గత కొంతకాలంగా ఐశ్వర్య – అభిషేక్ కలిసి ఎక్కడ కనిపించడం లేదు. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం ఐశ్వర్య. ఇంత వయసు వచ్చిన తనకు ఇష్టమైన సినిమా ప్రపంచాన్ని, గ్లామర్ ప్రపంచాన్ని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు.

ఇది ఐశ్వర్య అత్త జయ బచ్చన్ కు ఏ మాత్రం ఇష్టం లేదట. ఐశ్వర్య – అభిషేక్ కుమార్తె మనవరాలు అంటే అమితాబ్ కు ఎంతో ఇష్టం. అయితే ఐశ్వర్య తన మనవరాలను అమితాబ్ దగ్గర ఉంచేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదట. దీనికి తోడు ఐశ్వర్య తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో ఇటీవల సన్నిహితంగా ఉంటూ వస్తుందట. పైగా సల్మాన్ షోల‌కు కూడా హాజరవుతోంది. ఈ వయసులోనూ ఐశ్వర్య వస్త్రధారణ ఒక్కోసారి మరి జుగుత్సాకరంగా ఉంటుంది.

నువ్వు సాంప్రదాయ కుటుంబంలోకి కోడలుగా వచ్చావు. మనకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి. మన వ్యాపారాలు మనకు ఉన్నాయి.. సినిమాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఒక బాధ్యత కల గృహిణిగా ఉండాలని జయ సార్లు చెప్పిన ఐశ్వర్య ఆ మాటలు పెడచెవిన పెడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అత్తా కోడళ్ల‌ మధ్య మొదలైన ఈ గ్యాప్ క్రమక్రమంగా పెరిగి.. చివరకు అసలు అమితాబ్‌ కుటుంబం అంటేనే ఐశ్వర్యకు ఏమాత్రం పడని స్థాయికి పెరిగిపోయిందట.

దీంతో ఐశ్వర్య ఈ కుటుంబానికి దూరంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పి చూసిన ఐశ్వర్యలో మార్పు లేకపోవడంతో అభిషేక్ కూడా ఆమెను పట్టించుకోవడం మానేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశాలు లేవని.. కోడలి విషయంలో జయ పెట్టిన కండిషన్లకు తోడు ఇటు ఐశ్వర్య సల్మాన్ కు బాగా దగ్గరవ్వటం కూడా.. వీరి మధ్య విడాకులకు కారణం అవుతున్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news