Moviesరష్మిక ను చంపి ..ఆ డైరెక్టర్ బ్రతికిపోయాడా..? నెటిజన్ల తెలివికి హ్యాట్స్...

రష్మిక ను చంపి ..ఆ డైరెక్టర్ బ్రతికిపోయాడా..? నెటిజన్ల తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే..!!

ఏం పాపం చేసిందో తెలియదు కానీ ఎవరిని హార్ట్ చేసిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో రష్మిక అన్న పేరు కనబడితే చాలు డిస్ లైక్ లు కొట్టడం .. ట్రోల్ చేయడం.. డీగ్రేడ్ చేయడం ఆమెను హర్ట్ చేసే విధంగా కామెంట్స్ చేయడం అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఆమె నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో రష్మిక పేరు చెప్తేనే మండిపడుతున్నారు జనాలు . కాగా రీసెంట్ గానే రష్మిక తన పేరుని మళ్లీ పాపులారిటీ చేసుకుంటూ క్రేజ్ దక్కించుకుంటుంది.

ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ ఆమె పరువు మొత్తం గంగలో కలిపేసింది . పుష్ప సినిమాలో బన్నీకు జోడిగా నటించింది రష్మిక మందన . కెరియర్ లోనే ఫస్ట్ టైం డి గ్లామరస్ లుక్ లో కనిపించిన రష్మిక మందనకి కొత్త లైఫ్ ఇచ్చింది పుష్ప సినిమా నే చెప్పాలి . అలాంటిది పుష్ప2 టీజర్ లో రష్మిక లేకపోవడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో పుష్ప2 లో రష్మిక క్యారెక్టర్ చచ్చిపోతుందని .. సినిమా స్టార్ట్ అయిన అరగంటకే రష్మిక క్యారెక్టర్ ఎండ్ అయిపోతుందని .. ఆ తర్వాత ఓ బాలీవుడ్ బ్యూటీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి పుష్ప రాజ్ ని టోటల్ గా చేంజ్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే రిలీజ్ అయిన మూడు నిమిషాల టీజర్ లో రష్మిక మందన లేకపోవడం ఆమెకు సంబంధించిన చిన్న క్లిప్ కూడా సెకండ్ కూడా టెలికాస్ట్ కాకపోవడంపై ఇప్పుడు జనాల్లో కొత్త డౌట్లు మొదలవుతున్నాయి . నిజంగానే రష్మిక మందన క్యారెక్టర్ ఇందులో చచ్చిపోతుందా? డైరెక్టర్ ఎందుకు ఇలా చేశాడు ..? అంటుంటే బన్ని ఫాన్స్ మాత్రం రష్మిక క్యారెక్టర్ ని చంపేసి నువ్వు బతికిపోయావ్ ..లేకపోతే సినిమా అట్టర్ ప్లాప్ అయి ఉండేది.. ఇప్పుడు సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ బన్నీ డైలాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి రష్మిక పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కూడా అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news