Movies"చైతన్య జగత్ కంత్రీ.. ఆ అమ్మాయితో ఎఫైర్"..టాప్ సీక్రేట్ బయటపెట్టిన నీహారిక..!

“చైతన్య జగత్ కంత్రీ.. ఆ అమ్మాయితో ఎఫైర్”..టాప్ సీక్రేట్ బయటపెట్టిన నీహారిక..!

సినిమారంగంలో నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎంతో గందరగోళంగా ఉంటాయి. ఒకరిని ఒకరు ఎంత త్వరగా ఇష్టపడతారో ? ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటారో ? అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటారు. ఇక ఎప్పుడు ఎవరు ? పెళ్లి చేసుకుంటారు.. ఎందుకు విడాకులు ? తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం ఫేస్బుక్, వాట్సప్ లలో ప్రేమించుకుంటున్నారు. ట్విట్టర్ లో విడాకులు తీసుకుంటున్నారు అన్నట్టుగా బంధాలు బలహీన పడిపోయాయి.

ఇక గత కొద్దిరోజులుగా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక విడాకుల వార్తలు నెట్టెంట‌ పిచ్చపిచ్చగా వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల క్రితమే నిహారిక గుంటూరుకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తర్వాత నిహారిక వెండితెరకు దూరమైనా సినిమా రంగానికి మాత్రం దగ్గరగానే ఉంది.

నటి నుంచి నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఆమె నిర్మించిన కొన్ని వెబ్ సిరీస్ లు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక భర్తతో కలిసి టూర్లలో ఎంజాయ్‌లు, పార్టీలు సోషల్ మీడియాలో ఎప్పుడు తన అభిమానులకు ట‌చ్‌లో ఉంటుంది. ఇలా ఎప్పుడు చూసినా నిహారిక సోషల్ మీడియా నిండా నిహారిక భర్త చైతన్య ఫోటోలే ఉండేవి. దీంతో అభిమానులు కూడా మెగా ఫ్యామిలీకి మంచి అల్లుడు దొరికాడు.. నిహారికకు సరైన భర్త దొరికాడు అంటూ కామెంట్లు పెట్టేవారు.

ఏమైందో ఏమో గాని గత పది రోజులుగా ఈ జంట మధ్య విభేదాలు త‌లెత్తాయ‌ని.. వీరిద్దరూ త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ ఒకటే వార్తలు గుప్పుమన్నాయి. ఈ పుకార్లు నిజం చేసేలా చైతన్య తన భార్యతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేసేసాడు. అంతేకాకుండా నిహారికను అన్ ఫాలో కూడా చేశాడు. నిహారిక సైతం తన భర్తతో ఉన్న అన్ని ఫోటోలు డిలీట్ చేసింది.
అయితే ఒక్క ఫోటో మాత్రం వదిలిపెట్టింది.

పెళ్లిలో చైతన్యతో కలిసి ఉన్న ఫోటో మాత్రం నిహారిక డిలీట్ చేయలేదు. అయితే ఆ ఒక్క ఫోటో ఎందుకు ? డిలీట్ చేయలేదు అనేది మిస్టరీగా మారింది. అయితే ఆ ఫోటో కింద ఆమె ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. నా దగ్గర ఒక రహస్యం ఉంది.. అది మీకు చెప్తే రహస్యం ఎందుకు అవుతుంది ? దాన్ని నేను చెప్పలేను క్షమించండి అని ఉంది. దీంతో నిహారిక కావాలనే ఈ ఫోటో డిలీట్ చేయకుండా ఉంచింది అని.. ఆ రహస్యం ఏంటని ? రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

అలాగే మరో చర్చ‌ కూడా నడుస్తోంది. నిహారిక చెప్పనన్న ఆ రహస్యం తన భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని.. అది నచ్చకే ఆమె అతనికి దూరమైందని.. అందుకే ఆ విషయం బయట పెట్టడం ఆమెకు ఇష్టం లేదని కొత్త చర్చ మొదలైంది. ఏది ఏమైనా అసలు ఈ ఇద్దరు ఎడమొకం… పెడమొకం.. దూరం దూరంగా ఉండటంతో రకరకాల పుకార్లు అయితే వైరల్ అవుతున్నాయి. మరి అసలు నిజానిజాలు ఏంటి అన్నది ఈ దంపతులకే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news