Moviesఫైనల్లీ.. విడాకులు తీసుకున్న హీరో తో కనెక్ట్ అయిన వరలక్ష్మి.. ఈ...

ఫైనల్లీ.. విడాకులు తీసుకున్న హీరో తో కనెక్ట్ అయిన వరలక్ష్మి.. ఈ ట్విస్ట్ ఏంటి తల్లి…?

సినిమా ఇండస్ట్రీలో వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా వీర సింహారెడ్డి సినిమాలో ఆమె బాలయ్య చెల్లెలి పాత్రలో కనిపించి మెప్పించినప్పటి నుంచి ఆమె పేరు మరింత రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అంతకు ముందు క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది .

అయితే తన బాడీ ఫిజిక్కి హీరోయిన్గా కంటే విలన్ గానే పాత్రలు సెట్ అవుతాయని భావించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ వైపుగా అడుగులు వేసింది . ప్రజెంట్ కోలీవుడ్ -టాలీవుడ్ లో బడా అవకాశాలతో దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ..రీసెంట్గా తమిళ్ హీరో కి తల్లిగా చేయడానికి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా ఇండస్ట్రీలో క్రేజీ టాక్ ఉన్న హీరోతో కావడం గమనార్హం.

కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ధనుష్ కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాల్సిందే . రీసెంట్గా సార్ సినిమాతో ఎలాంటి కూల్ క్లాసు హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడో తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే ఆయన తర్వాతి సినిమాలో వరలక్ష్మీ ఆయనకు తల్లిగా నటించబోతుందట . ధనుష్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ను తల్లిగా నటించమని అప్రోచ్ అయ్యారట . ఈ క్రమంలోనే ఆమె కూడా కధ కంటెంట్ బాగుండడంతో తల్లిపాత్రైనా ఒప్పుకుంది అన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఇన్నాళ్లు విలన్ గా చేసిన నువ్వు ఇప్పుడు సడన్గా పాజిటివ్ రోల్స్ ఉన్న తల్లి పాత్ర చేయడం ఏంటి తల్లి నీకు విలన్ రోల్సే బాగుంటాయి అవే చూస్ చేసుకో అంటూ సజిస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news