Moviesబాల‌కృష్ణ‌తో పాత ప్రేమ చిగురించిందా... మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టిన హీరోయిన్‌..!

బాల‌కృష్ణ‌తో పాత ప్రేమ చిగురించిందా… మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టిన హీరోయిన్‌..!

ఓ సీనియ‌ర్ హీరోయిన్ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌పై మ‌న‌సు పారేసుకుంది. ఆమెలో పాత ప్రేమ చిగురించిన‌ట్టుగా ఉంది. ఇన్నేళ్ల త‌ర్వాత ఆ పాత్ర ప్రేమ చిగురించ‌డంతో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు ఖుష్బూ. బాల‌య్య‌, ఖుష్బూ చెన్నైలో ఉన్న‌ప్పుడు వీరి కెరీర్ ఆరంభంలో మంచి స్నేహితులు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డార‌ని కూడా అంటారు.

బాల‌య్య సైతం ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని ప‌ట్టుబ‌డితేనే త‌న‌కు సినిమా హీరోయిన్ కోడలిగా రావ‌డం ఇష్టంలేని ఎన్టీఆర్ వ‌సుంధ‌ర‌తో బాల‌య్య‌కు అప్ప‌టిక‌ప్పుడు పెళ్లి చేశార‌ని అంటారు. ఆ త‌ర్వాత ఖుష్బూ మ‌రో త‌మిళ హీరో ప్ర‌భును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ప్ర‌భు ఫ్యామిలీకి ఇష్టం లేక‌పోవ‌డంతో నాలుగు నెల‌ల‌కే విడాకులు ఇచ్చేసి ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్ సి. సుంద‌ర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

తాజాగా ఖుష్బూ తెలుగులో గోపీచంద్ రామ‌బాణం సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో జగపతిబాబుకు భార్యగా, గోపీచంద్‌కు వదినగా ఖుష్బూ కనిపిస్తారు. వ‌చ్చే నెల 5న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఖుష్బూ మాట్లాడుతూ తెలుగు హీరోల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఖుష్బూ తెలుగులో ఇప్ప‌టికే వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లతో కలిసి నటించారు.

తాను బాల‌కృష్ణ‌తో క‌లిసి న‌టించ‌లేద‌ని.. ఆయ‌న‌తో ఆ అవ‌కాశం వ‌స్తే న‌టించాల‌ని ఉంద‌ని చెప్పింది. ఖుష్బూ బాల‌య్య‌తో న‌టించాల‌ని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్ట‌డంతో ఇప్పుడు ఆమెకు బాల‌య్య‌పై ఉన్న పాత ప్రేమ చిగురించిందా ? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రి బాల‌య్య త‌న పాత స్నేహితురాలో లేదా ల‌వ‌రో గాని ఖుష్బూకు ఆ ఛాన్స్ ఇస్తాడేమో చూద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news