Moviesబిగ్ బ్రేకింగ్‌: స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఇంటీపై ఐటీ రైడ్‌.. అస‌లు...

బిగ్ బ్రేకింగ్‌: స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఇంటీపై ఐటీ రైడ్‌.. అస‌లు కార‌ణం ఇదే..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్ జరిగినట్లు స‌మాచారం అందుతోంది. ప్ర‌స్తుతం ఐటీ అధికారులు ప‌లు డాక్యుమెంట్లు ప‌రిశీలిస్తున్నార‌ట‌. అయితే ఈ రైడ్ వెన‌క పూర్తి వివ‌రాలు అయితే అందాల్సి ఉంది. సుకుమార్ గ‌త కొన్నేళ్లుగా వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. నాన్న‌కు ప్రేమ‌తో, రంగ‌స్థ‌లం, పుష్ప ఇలా మూడు వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్లు ప‌డ్డాయి. ఇప్పుడు పుష్ప 2 సినిమా తెర‌కెక్కిస్తున్నారు.

పుష్ప సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే పుష్ప 2 సినిమాను ఏకంగా రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు సుకుమార్ రేంజ్‌, రెమ్యున‌రేష‌న్లు భారీగా పెరిగిపోయాయి. మ‌ధ్య‌లో సుకుమార్ కొన్ని సినిమాలు నిర్మించ‌డంతో పాటు త‌న సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కించాడు.

ప్ర‌స్తుతం పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ ఏకంగా రు. 100 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నిర్మాత‌లు మైత్రీ మూవీస్ వాళ్ల‌పై గ‌తంలోనే ఐటీ రైడ్స్ జ‌రిగాయి. ఇప్పుడు సుకుమార్ త‌న ఆస్తుల లెక్కల వివ‌రాలు స‌రిగా ఉంచారా ? లేదా ప‌న్ను చెల్లింపులు ఎలా ఉన్నాయ‌న్న అంశం మీదే ఈ రైడ్ జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news