Moviesబన్నీ కట్టుకున్న ఈ చీర ఎవరిదో తెలుసా..? ఇంతకంటే అదృష్టం మరోకటి...

బన్నీ కట్టుకున్న ఈ చీర ఎవరిదో తెలుసా..? ఇంతకంటే అదృష్టం మరోకటి ఉంటుందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే మారుమ్రోగిపోతుంది. దానంతటకీ కారణం రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప2 టీజరే . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నిమిషాల పాటు రిలీజ్ చేసిన ఈ టీజర్ లో బన్నీ కనిపించింది ఒకే ఒక్కసారి .. అయినా సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసేసాడు. ఒకే ఒక్క డైలాగ్ తో బాక్సాఫీస్ రికార్డులు దుమ్ము దులిపేసాడు. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసాడు .

మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో బన్నీ అమ్మవారి అవతారంలో ఉన్న గెటప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సినిమాలో పోలీస్ అయిన భనవర్ సింగ్ షెకావత్ నుంచి పుష్పరాజ్ తప్పించుకునే క్రమంలో పలు రకాల వేషాలు వేస్తారని .. ఆ వేషాలలో ఒకటే ఈ అవతారం అని.. అమ్మవారి రూపంలో బన్నీ భనవర్ సింగ్ షెకావత్ నుంచి తప్పించుకొని పోలీసులకు చుక్కలు చూపిస్తాడని తెలుస్తుంది .

ఈ క్రమంలోనే బన్నీ కట్టుకున్న శారీ ..పెట్టుకున్న నగలు ఫొటోస్ వైరల్ గా మారాయి . అయితే బన్నీ కట్టుకున్న ఈసారి ఎవరిదో కాదు బన్నీ వాళ్ళ అమ్మ గారిది అన్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అమ్మవారి పాత్ర కోసం బన్ని నే కట్టుకున్నారట . ఇంతకన్నా అమ్మ పై ప్రేమను ఎవరు ఎలా చూపించగలరు ..? అని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఏది ఏమైనా సరే పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో కాదు గ్లోబల్ స్థాయిలో బన్నీ రికార్డు నెలకోల్పతాడు అంటున్నారు బన్నీ ఫాన్స్ . చూడాలి మరి బన్నీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో.. ఎలాంటి కొత్త రికార్డును క్రియేట్ చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news