Newsద్యావుడా..హీరోయిన్‌లను అలా చేయడంలో త‌మిళ ఇండ‌స్ట్రీ అంత టాప్ లో ఉందా..?

ద్యావుడా..హీరోయిన్‌లను అలా చేయడంలో త‌మిళ ఇండ‌స్ట్రీ అంత టాప్ లో ఉందా..?

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఒక ద‌శ‌లో దూకుడుగా ఉంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో చెన్నైలోనే షూటింగులు జ‌రిగేవి. అక్క‌డే అగ్ర‌తార‌లు ఉండేవారు. దీంతో తెలుగు సినిమా షూటింగులు అన్నీ కూడా.. అక్క‌డి స్టూడి యోల్లోనే జ‌రిగేవి. ఔట్ డోర్ షూటింగుల‌కు మాత్రం.. మైసూరు.. బెంగ‌ళూరు వంటివాటికివ‌చ్చేవారు. ఇక‌, త‌మిళ‌నాడు సినిమాలు కూడా.. అక్క‌డే జ‌రిగేవి. దీంతో అంద‌రూ బిజీబిజీగా ఉండేవారు

ఇక‌, వీరి మ‌ధ్య పోటీ కూడా ఉండేది. మ‌రీ ముఖ్యంగా.. మ‌ద్రాస్ రాష్ట్రంలో ఈ పోటీ మ‌రింత ఎక్కువ‌గా ఉండేది. మ‌ద్రాస్ వారికి తెలుగు వారంటే ప‌డ‌క‌పోవ‌డం.. అనే కామెంట్లు ఇక్క‌డ నుంచే వ‌చ్చాయి. త‌మ కు పోటీ అవుతుండ‌డం వ‌ల్లే తెలుగు వారిని తొక్కేయాల‌ని త‌మిళ‌నాడు ఇండ‌స్ట్రీలో ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. ఇలా.. తెలుగు ఇండ‌స్ట్రీని తొక్కేసే క్ర‌మంలోనే ఎక్స్‌పోజింగ్‌కు త‌మిళ ఇండ‌స్ట్రీ ప్రాధాన్యం ఇచ్చింద‌నే టాక్ ఉంది.

స‌గ‌టు ప్రేక్ష‌కుడిని ఆక‌ర్షించ‌డ‌మే సినిమా ల‌క్ష‌ణం.. అనే మాట‌.. 1970ల‌లో త‌మిళ ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా జ‌రిగింది. ఇది ఒక‌ర‌కంగా తెలుగు ఇండ‌స్ట్రీని తొక్కి .. తాము ఎద‌గ‌డం అనే వ్యూహం అమ‌లు చేయ‌డ‌మే. ఇక్క‌డే తెలుగు ఇండ‌స్ట్రీ లైన్ త‌ప్ప‌కుండా ముందుకు సాగింది. త‌మిళ ఇండ‌స్ట్రీలో 70ల‌లోనే ఎక్స్‌పోజిం గ్ వ‌చ్చేసింది. అప్ప‌ట్లోనే ఎక్కువ మంది హీరోయిన్ల‌తో ఎక్స్‌పోజింగ్ ఉన్న పాత్ర‌లే న‌టించేలా చేశారు.

తెలుగు చిత్రాల్లో మాత్రం మ‌న‌కు 80ల వ‌ర‌కు ఆ ప‌రిస్థితి లేదు. 70ల వ‌ర‌కు కూడా..చాలా మంది ద‌ర్శ‌కులు పోటీ ఉన్నా.. క‌థ‌, క థ‌నం.. నిర్మాణ విలువ‌లు .. వంటివాటితోనే పోటీ ప‌డ్డారు. త‌మిళ‌రంగం మాత్రం.. ఎక్స్‌పోజింగ్‌తో తెలుగు ఇండ‌స్గ్రీని డామినేట్ చేసింది ఇప్ప‌టికీ కూడా.. ఎక్స్‌పోజింగ్ దృశ్యాల్లో.. హీరోయిన్‌ను వాడుకునే విష‌యంలో త‌మిళ ఇండ‌స్ట్రీనే ఫ‌స్ట్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news