Moviesమ‌హేష్ న‌మ్ర‌త కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించాడా…!

మ‌హేష్ న‌మ్ర‌త కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించాడా…!

సూపర్ స్టార్ కృష్ణ నటవరసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి వచ్చి 24 సంవత్సరాలు అవుతున్నా ఇప్ప‌ట‌కీ ఎలాంటి వివాదాల్లో తలదూర్చ కుండా చాలా హ్యాపీగా తన సినిమా కెరియర్ కొనసాగిస్తున్నారు. మహేష్ వయసు 50 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలాగా తన అందంతో మెరిసిపోతూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే వయసు పెరుగుతున్న కూడా మహేష్ బాబు అందం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో మహేష్ బాబు గ్లామర్ చూసిన చాలామంది నెటిజెన్లు మహేష్ అందం రహస్యం ఏంటి ? ఏదైనా అమృతం తాగి పెరుగుతున్నాడా అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ ఉంటారు.

మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లతో నటించారు. అయితే ఏ హీరోయిన్ విషయంలోనూ మహేష్ పై ఎలాంటి ఎఫైర్ వార్తలు రాలేదు. ఆయన ప్రేమించిన ఏకైక హీరోయిన్ ఆయన భార్య నమ్రత. వంశీ సినిమాలో నటించే టైంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వయసులో మహేష్ కంటే నమ్రత ఏడాది పెద్ద. అయినా కూడా ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2005లో పెళ్లి చేసుకున్నారు.

ఈ విషయం పక్కన పెడితే నమ్రత కంటే ముందే మహేష్ బాబు మరో హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. ఆ హీరోయిన్ కూడా బాలీవుడ్ హీరోయిన్ కావటం విశేషం. ఆమె ఎవరో కాదు ప్రీతిజింతా. వీరిద్దరి కాంబినేషన్లో రాజకుమారుడు సినిమా వచ్చింది. అది హీరోగా మహేష్ బాబుకు తొలి సినిమా. కె రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. విచిత్రం ఏంటంటే వయసులో ప్రీతిజింతా కూడా మహేష్ బాబు కంటే పెద్దది.

ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. దర్శకుడు రాఘవేంద్రరావు వీరిద్దరి మధ్య ప్రేమ సీన్లు అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఉన్న కొన్ని సినీ పత్రికలు వీరిద్దరి మధ్య ఎఫైర్ నడిచింది అంటూ వార్తలు రాసి పడేసాయి. అసలు వాస్తవం ఏంటో గాని ఈ రూమర్ మాత్రం అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news