Moviesవామ్మో..అనుపమలో ఉన్న ఈ కొత్త టాలెంట్ చూసారా..? సౌత్ ఫిలిం ఇండస్ట్రీ...

వామ్మో..అనుపమలో ఉన్న ఈ కొత్త టాలెంట్ చూసారా..? సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఫస్ట్ టైం ఇలా..!!

యస్.. ప్రెసెంట్ అనుపమ పరమేశ్వరన్ పేరు సోషల్ మీడియాలో.. సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గానే బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు హ్యాట్రిక్ హీట్లను కొట్టిన అనుపమ పరమేశ్వరన్.. నాలుగో సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తుందా..? అంటూ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . దక్షిణాది భాషలు అన్నిటిలోనూ నటిస్తూ.. తన కెరియర్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని.. నటి అనుపమ పరమేశ్వరన్ శభాష్ అనిపించుకుంటుంది.

కేవలం నటి ఏ కాదు తనలో.. ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ కూడా ఉంది అంటూ ప్రూవ్ చేసింది . సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన “ఐ మిస్ యు” అనే షార్ట్ ఫిల్మ్‌తో డోఫ్ గా మారి అందరిని ఆశ్చర్య పరిచింది అనుపమ. ఈ షార్ట్ ఫిలిం ను చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ షార్ట్ ఫిలిం లో అనుపమ కెమెరా వర్క్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

కంటెంట్ పరంగా సినిమాటోగ్రాఫర్ పరంగా ఎటువంటి నెగటివ్ మార్క్ లేకుండా దూసుకుపోతున్న ఈ షార్ట్ ఫిలిం..ప్రజెంట్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. హీరోయిన్ గా నే కాదు..ప్రొఫెషనల్ సినిమా ఆటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఫస్ట్ టైం గా మారింది. ఆ రకంగా అనుపమ పరమేశ్వరన్ సంచలన రికార్డ్ నెలకొల్పిందనే చెప్పాలి . రీసెంట్గా తెలుగులో కార్తికేయ 2 , 18 పేజస్, బటర్ ఫ్లై.. సినిమాలతో హిట్ అందుకున్న అనుపమ.. మలయాళం లో తమిళంలో రెండు సినిమాలకు సీన్ చేసింది. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి సరికొత్త టచ్ చేస్తూ ఉండే అనుపమలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news