News"ఇన్నాళ్లు లేవని నోర్లు ..ఇప్పుడు లేస్తున్నాయే ఏం..".. ఫస్ట్ టైం కోపంతో...

“ఇన్నాళ్లు లేవని నోర్లు ..ఇప్పుడు లేస్తున్నాయే ఏం..”.. ఫస్ట్ టైం కోపంతో ఊగిపోయిన ఆమల..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోలు ఏ విధంగా ట్రోలింగ్కి గురవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిద్రలేచిన మొదలు పడుకునే వరకు అక్కినేని హీరోలపై ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది . అంతేకాదు అక్కినేని హీరోలు ట్రోలింగ్కి గురవుతూనే ఉంటారు . కాగా రీసెంట్గా అక్కినేని హీరో అఖిల్ నటించిన సినిమా ఏజెంట్ మొన్న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది . అంతేకాదు కెరియర్ లో పరమ చెత్త కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అఖిల్ ను ఓ రేంజ్ లో ఏకిపారేశారు జనాలు .

అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అక్కినేని అమల కొడుకుని ట్రోలింగ్ చేసేసరికి చూడలేకపోయింది ..కడుపు మండి ఓపెన్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . “అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాపై చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు.. సినిమాల్లో ప్లస్లు, మైనస్లు ఉన్నాయి . కానీ ఓపెన్ మెంతో చూస్తే సినిమా చాలా బాగుంటుంది .. నేను సినిమా చూసిన థియేటర్లో చాలా మంది లేడీస్ వచ్చారు. అమ్మలు అమ్మమ్మలు అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు” అంటూ పరోక్షకంగా అక్కినేని అఖిల్ ని ట్రోల్ చేస్తున్న వారికి దిమ్మతిరిగే కౌంటర్ వేసింది .

ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య ఫ్యాన్స్ అమల పై ఫైర్ అవుతున్నారు . కొడుకుని ట్రోలింగ్ చేసేసరికి అంత కోపం వచ్చింది మరి ఇన్నాళ్లు అక్కినేని నాగచైతన్యను పరమ చెత్త మాటలతో ట్రోలింగ్ చేశారు . అప్పుడు నీ నోరు ఎందుకు లేవలేదు ..? నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు..? నీ కొడుకు మాత్రమే నీకు ఇంపార్టెంటా..? నాగచైతన్య కూడా నీ కొడుకు లాంటి వాడే కదా అంటూ ఫైర్ అయిపోతున్నారు. దీంతో అమల ఏదో ఊహించుకొని పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఫ్యామిలీలోనే చిచ్చు పెట్టినట్లయింది. చూడాలి మరి దీనిపై అక్కినేని అమల ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news