Moviesఏజెంట్ ఐటెం భామ డ్రెస్ చూస్తే క‌ళ్లు జిగేల్‌… వామ్మో ఒక్క...

ఏజెంట్ ఐటెం భామ డ్రెస్ చూస్తే క‌ళ్లు జిగేల్‌… వామ్మో ఒక్క డ్రెస్ ఇంత రేటా…!

అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వసి రౌతేలా స్పెషల్ ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. వైల్డ్ చాలా అంటూ సాగిన ఈ పాటకు రిలీజ్ ముందే మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు థియేటర్లలో కూడా ఈ జోడిని చూసిన ప్రేక్షకులు బాగా సర్ప్రైజ్ అవుతున్నారు. మాస్ ఆడియెన్స్‌ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ ఐటెం సాంగ్ ఉంది. ఐటెం సాంగ్ లో హీరోయిన్ ఊర్వసి రౌతేలా వేసుకున్న‌ డ్రెస్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఏజెంట్ మేకర్స్ ఊర్వశి కోసం ఆ కాస్ట్యూమ్స్ చాలా స్పెష‌ల్‌గా డిజైన్ చేయించారట. న్యూయార్క్ రెట్రో ఫ్రెట్ బ్రాండ్ లో ఊర్వశి లుక్ అదిరిపోయింది. ఈ స్పెష‌ల్ కాస్ట్యూమ్స్ కోస‌మే ఏకంగా రు. 20 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశార‌ట‌. సినిమాలో హీరోయిన్‌ సాక్షి వైద్య పాత్ర కు ఎంత ప్రాముఖ్యత దక్కిందో అదే స్థాయిలో ఊర్వశి ఐటం సాంగ్ కు అంతే ప్రాధాన్య‌త ఇచ్చార‌ని తెలుస్తోంది.

ఊర్వశి రౌతే లా ఈ సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య లో కూడా బాస్ పార్టీ ఐటెం సాంగ్ చేసి అందాల‌తో కుర్ర‌కారును ఊపేసింది. ఏదేమైనా ఊర్వ‌శి అందాలు కుర్ర‌కారుకు మాంచి కిక్ ఇస్తున్నాయి. దీంతో ఆమె హీరోయిన్‌గా చేయాల‌న్న డిమాండ్లు కూడా టాలీవుడ్ సినీ జ‌నాల నుంచి వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news