Moviesవిడాకుల తరువాత ఫస్ట్ టైం "అక్కినేని" పేరు ప్రస్తావించిన సమంత.. ఎందుకో...

విడాకుల తరువాత ఫస్ట్ టైం “అక్కినేని” పేరు ప్రస్తావించిన సమంత.. ఎందుకో తెలిస్తే జుట్టు పీకోవాల్సిందే..

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న ఈ జంట అప్పటినుంచి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురవుతూనే ఉంది . విడాకులు తీసుకున్న తర్వాత ఆరు నెలల పాటు సమంత విడాకుల గురించి ఏం ప్రస్తావించనే లేదు . విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ ఎక్కడా చెప్పలేదు . అఫ్కోర్స్ ఇప్పటికీ చెప్పలేదు ..కానీ పరోక్షకంగా అక్కినేని నాగచైతన్య పై మాత్రం కౌంటర్స్ వేస్తూనే వచ్చింది .

ఇలాంటి క్రమంలోనే నాగచైతన్యను మరోసారి హార్ట్ చేస్తూ అక్కినేని అభిమానులకు సర్ప్రైజ్ చేసింది సమంత . అక్కినేని నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఏజెంట్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది . ఈ క్రమంలోనే అఖిల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు ఏజెంట్ టీం.

ఈ క్రమంలోనే అఖిల్ ఏజెంట్ కొత్త పోస్టర్ ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే అఖిల్ అక్కినేని అంటూ ఇంటి పేరుతో సహా మెన్షన్ చేసి ఏజెంట్ సినిమా హిట్ అవ్వాలని స్పెషల్గా కోరుకుంది . నాగచైతన్య గురించి నాగార్జున గురించి అసలు ఏ మాత్రం స్పందించని సమంత .. కేవలం అక్కినేని అఖిల్ అంటే మాత్రం ఎంతో ఇష్టంగా ఉంటుందని ..నాగచైతన్య తో కలిసి ఉన్నప్పుడు కూడా అన్న కన్న ఎక్కువగానే అఖిల్ సమంతకి క్లోజ్ అయ్యాడని చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని అన్న పేరు అన్న గురించి పట్టించుకోని సమంత మరిది గురించి పట్టించుకోని తన సినిమాకి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుంది అని నాగచైతన్య అందుకు పనికిరాడు అంటూ సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news