Moviesబాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్ఞ సినిమాపై అదిరే అప్‌డేట్‌... ఆ డైరెక్ట‌ర్ ఫిక్స్...

బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్ఞ సినిమాపై అదిరే అప్‌డేట్‌… ఆ డైరెక్ట‌ర్ ఫిక్స్ అయ్యాడా…!

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ఐదారు సంవత్సరాలుగా రకరకాల వార్తలు పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. అసలు బాలయ్య అభిమానులు అయితే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాగర్జున, చిరంజీవి వారసులు సినిమాల్లోకి వచ్చేసి దూసుకుపోతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నుంచి ఉంటుందని బాగా ప్రచారం జరిగింది.

ఆ సినిమా వచ్చి కూడా ఆరేళ్ల అవుతోంది. ఇప్పటికీ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ఎలాంటి ప్రకటన లేదు. బాలయ్య మాత్రం త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడని.. అందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడని ఒక చిన్నమాట చెప్పి వదిలేశారు. అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు కూడా ఇప్పటికే వినిపించాయి. తాజాగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలయ్య కెరీర్లో 108వ సినిమాగా ఇది తరికెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఆగస్టు కు పూర్తి కానుంది. ఆ వెంటనే అక్టోబర్ నుంచి మోక్షజ్ఞ సినిమాపై అనిల్ రావిపూడి కూర్చుంటాడట. అనిల్ ఇప్పటికే ఆరు వరుసహిట్లతో తిరుగులేని పాపులర్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నాడు. బాలయ్య సినిమా కూడా హిట్ అయితే అనిల్ కు మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యతలు అప్పగించే విషయంలో బాలయ్య కూడా మరో ఆలోచన చేయకపోవచ్చు.

ఇప్పుడు అనిల్.. బాలయ్య సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తే తిరుగే ఉండదు. ఏదేమైనా ఈ ఏడాది చివర్లో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అయితే ఖాయంగా కనిపిస్తోంది. వారాహి చలనచిత్రం బ్యాన‌ర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వస్తే నందమూరి అభిమానులకు అంతకన్నా కావలసిన ఆనందం ఏముంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news