Moviesర‌వితేజ‌ సినిమా విష‌యంలో లయకు అవమానం.. అందుకు ఒప్పుకోలేద‌ని తొక్కేశారా...?

ర‌వితేజ‌ సినిమా విష‌యంలో లయకు అవమానం.. అందుకు ఒప్పుకోలేద‌ని తొక్కేశారా…?

తెలుగమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. చాలామంది దర్శకనిర్మాతలు తెలుగమ్మాయిలకు ఆటిట్యూడ్ ఎక్కువ అని ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపరు. ఈ రీజన్ వల్లే ఇతర భాషల హీరోయిన్లు తెలుగులో సక్సెస్ సాధించిన స్థాయిలో టాలీవుడ్ హీరోయిన్లు సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన లయ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

కూతురి ఎంట్రీ కోసమే లయ వరుస ఇంటర్య్వూలు ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. లయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ, కళ్యాణి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలో మొదట నేను హీరోయిన్ గా చేయాల్సిందని నాకు తెలీకుండా ఏదో జరగడం వల్ల ఆ మూవీ మిస్ అయిందని ఆమె పేర్కొన్నారు. దొంగరాముడు అండ్ పార్టీ సినిమాలో నటించినా ఆ సినిమా సక్సెస్ కాలేదని లయ కామెంట్లు చేశారు.

దొంగోడు సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయిందని లయ పరోక్షంగా చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో మంచి ప్రాజెక్ట్ లలో ఛాన్స్ రావాలంటే కొన్నిసార్లు దర్శకుల దగ్గర పని చేసేవాళ్లకు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకపోతే అవకాశాలు మిస్ అయ్యేలా చేస్తారు. లయ విషయంలో ఇదే జరిగిందని ఆమెను తొక్కేశారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పీఆర్ ను పెట్టుకుని ఉంటే కెరీర్ బాగుండేదని లయ సైతం అభిప్రాయపడ్డారు.

లయ తన సినీ కెరీర్ లో అభినయ ప్రధాన పాత్రల్లోనే ఎక్కువగా కనిపించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే దక్కలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద సమేత లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో మంచి రోల్ ను మిస్ చేసుకుని లయ తప్పు చేశారు. ఆ పాత్రలో ఈశ్వరీరావు నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో బంధువులలో కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వచ్చాయని ఆమె తెలిపారు.

సక్సెస్ ఉంటే బంధువుల బిహేవియర్ లో కూడా మార్పు వస్తుందని లయ చెప్పుకొచ్చారు. నా పప్పీని కూడా ప్రేమగా చూసుకుంటానని కోవిడ్ టైమ్ లో కుక్కపిల్ల దొరికిందని లయ అన్నారు. మనుషులు ఒకేలా ఎప్పుడూ ఉండరు అని నాకు అర్థమైందని ఆమె తెలిపారు. పరిస్థితులను బట్టి మార్పు సహజం అని ఆమె అన్నారు. తిట్టినవాళ్లే కొన్నిసార్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతారని ఏదీ పర్మనెంట్ కాదని అర్థమైందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news